తరచూ క్యాబేజీ తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదా.. ఇందులో నిజం ఎంత..!

క్యాబేజీ.. సాధారణంగా చాలామంది దీన్ని ఇష్టపడరు కానీ ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని సరస్సు తీసుకోవడం వల్ల వాళ్ళు రకాల ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయని తెలుస్తోంది ముఖ్యంగా తాజాగా జరిగిన అధ్యయనాల్లో క్యాబేజీని

తరచూ క్యాబేజీ తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదా.. ఇందులో నిజం ఎంత..!


క్యాబేజీ.. సాధారణంగా చాలామంది దీన్ని ఇష్టపడరు కానీ ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని సరస్సు తీసుకోవడం వల్ల వాళ్ళు రకాల ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయని తెలుస్తోంది ముఖ్యంగా తాజాగా జరిగిన అధ్యయనాల్లో క్యాబేజీని దర్శి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కి సంబంధించిన కారకాలు దరిచేరవని తెలుస్తోంది..
What Is Green Cabbage?
 
క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటీరీ లక్షణాలుంటాయి. దీనిలో పీచుపదార్థాలు, రైబోఫ్లేవిన్, ఫోలేట్, విటమిన్ సి, థయామిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, నియాసిన్, కాల్షియం, భాస్వరం, ఇనుము, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలం. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
క్యాబేజీలో విటమిన్ ఎ, రిబోఫ్లేవిన్, ఫోలేట్, బి6లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది గుండెజబ్బుల నుంచి రక్షిస్తుంది. 
అంతేకాదు, పొటాషియం ఎక్కువగా ఉన్న క్యాబేజీని తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది. క్యాబేజీని తినడం వల్ల అధికబరువు, కండరాల నొప్పులు తగ్గించి జుట్టు పెరుగుదల పెరుగుతుంది.
How to Grow Cabbage: Your Complete Guide - AZ Animals
క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్‌లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల కడుపులో మంట,కడుపులో పూతలు తగ్గుతాయి. కాబట్టి కడుపు మంట ఉన్నప్పుడు క్యాబేజీ రసం త్రాగితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటీస్ పేషెంట్లకు క్యాబేజీ మంచి ప్రయోజనకరంగా ఉంటుందట. ఎందుకంటే క్యాబేజీ ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. క్యాబేజీని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగే అవకాశమే ఉండదు.
ముఖ్యంగా కాన్సర్ నిరోధకంగా క్యాబేజీ తినొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీని తరచు తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుందని ఆ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని తెలుస్తోంది. 
క్యాబేజీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షించడానికి సహాయపడతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.