Coconut water : కొబ్బరి నీళ్లు తరచూ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలియాల్సిందే.. 

Coconut water : సహజంగా దొరికే అమృత పానీయాల్లో ఒకటి coconut water. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.  అందుకే వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది .

Coconut water : కొబ్బరి నీళ్లు తరచూ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలియాల్సిందే.. 
Benefits of coconut water


Coconut water.. సహజంగా దొరికే అమృత పానీయాల్లో ఒకటి.. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. 
అందుకే వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది అలాగే వీటిలో ఉండే పోషకాలు అందాన్ని కాపాడడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయని అంటున్నారు నిపుణులు.. 

కొబ్బరినీళ్లలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి ముఖ్యంగా వీటిలో మినరల్స్, విటమిన్స్ , ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.. అలాగే అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి.. గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేయడంలో వీటి పాత్ర కీలకం.. కొబ్బరి నీళ్లు రక్తం గడ్డకట్టే సమస్యను పరిష్కరిస్తాయి. కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్ల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. కొబ్బరినీళ్లు పొటాషియం ఎక్కువగా ఉంటుంది.. 

అందువలన కాస్త వయసు పై పడగానే వచ్చే తిమ్మిర్లు నుండి కొబ్బరినీళ్లు ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు.. అలాగే ఆస్తమాతో బాధపడేవారు కూడా కొబ్బరి నీళ్లను ఎలాంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చు.. చాలామందిని అజీర్తి సమస్య వేధిస్తుంది ఇలాంటివారు కొబ్బరినీళ్లను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.. అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్ళను తీసుకోవడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది..  అందం విషయంలో కూడా కొబ్బరినీళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి, చర్మానికి కావలసిన పోషకాలు అంది మంచి నిగారింపు సంతరించుకుంటుంది అలాగే తరచు డిహైడ్రేషన్తో బాధపడేవారు రోజు కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.. అలాగే చాలాసార్లు శరీరానికి వేడి చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.  జలుబు నుంచి తీవ్రమైన ఫైల్ సమస్య వరకు వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తాయి అయితే ఈ సమయంలో కొబ్బరినీలను తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ వెంటనే తగ్గిపోతాయి.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.. అందుకే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కొబ్బరి నీళ్లను తరచూ తీసుకోమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.