కొలెస్ట్రాల్‌  ఎక్కువగా ఉందా..? ఇలా చేయండి

మన శరీరానికి చెడు కొలెస్ట్రాల్‌ అతి పెద్ద శత్రువు. ఎప్పుడైతే ఒక మనిషిలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ పెరుగుతాయో.. ఇక ఒకదాని తర్వాత ఒక సమస్య రావడం స్టాట్‌ అవుతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి, గుండెకు సరిగ్గా రక్తం సరఫరా కాదు, బీపీ ఉన్నవాళ్లకు అయితే.. ఇంకా ప్రమాదం.. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మనం ఆరోగ్యంగా ఉన్న సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్‌

కొలెస్ట్రాల్‌  ఎక్కువగా ఉందా..? ఇలా చేయండి


మన శరీరానికి చెడు కొలెస్ట్రాల్‌ అతి పెద్ద శత్రువు. ఎప్పుడైతే ఒక మనిషిలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ పెరుగుతాయో.. ఇక ఒకదాని తర్వాత ఒక సమస్య రావడం స్టాట్‌ అవుతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి, గుండెకు సరిగ్గా రక్తం సరఫరా కాదు, బీపీ ఉన్నవాళ్లకు అయితే.. ఇంకా ప్రమాదం.. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మనం ఆరోగ్యంగా ఉన్న సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్‌ టెస్టు చేయించుకోవాలి. ఇక కొంతమందికి ఎలాగూ తెలుసు.. కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉందని. కొన్ని ఆహారాలను డైలీ తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. 
Bad cholesterol | శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిందా..? ఇలా  తెలుసుకోండి..!-Namasthe Telangana
ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గిపోతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించేందుకు జీల‌క‌ర్ర కూడా బాగానే ప‌నిచేస్తుంది. జీల‌క‌ర్ర క‌షాయాన్ని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తాగొచ్చు. లేదా ఒక క‌ప్పు పెరుగులో కొద్దిగా జీల‌క‌ర్ర పొడిని క‌లిపి తిన‌వ‌చ్చు. దీంతో కొలెస్ట్రాల్ త‌గ్గిపోతుంది.
రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను అలాగే న‌మిలి తినాలి. దీంతో బీపీ త‌గ్గ‌డ‌మే కాదు.. చెడు కొలెస్ట్రాల్ కూడా క‌రిగిపోతుంది. వెల్లుల్లిని పచ్చిగా తినలేం అంటే..రోస్ట్‌ చేసుకుని తినొచ్చు. ఇలా చేస్తే టేస్టీగా కూడా ఉంటుంది. 
రోజూ ఉద‌యాన్నే ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతుండాలి. ఇది కూడా కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది.
రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి ముందు ఒక టీస్పూన్ అల్లం ర‌సం సేవించాలి. దీని వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి.
రాత్రి పూట అతిమ‌ధురం చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కలిపి తాగాలి. దీని వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.
దీంతోపాటు.. మాంసాహారం తినడం తగ్గించండి, అలాగే బయటి ఆహారాలను ముఖ్యంగా జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. వారానికి రెండు మూడు సార్లు బిర్యానీలు తినేవాళ్లు ఉంటారు. ఇలా చేస్తే.. త్వరలోనే లావు అయిపోయి.. అనేక సమస్యల భారిన పడాల్సి వస్తుంది. మీ ఆరోగ్యానికి, మీ అందానికి మీరు రెస్పెక్ట్‌ ఇవ్వాలి మరీ..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.