వామ్మో.. దేశంలో ఇంతమంది షుగర్ తో బాధపడుతున్నారా..? ఈ లెక్కలు తెలిస్తే గుండె దడదడలాడల్సిందే!

జీవనశైలి మార్పుల్లో భాగంగా  తీసుకునే ఆహారం వల్ల    ఎక్కువ మంది   వ్యాధుల బారిన  పడుతున్నారు.    ముఖ్యంగా బీపీ, షుగర్, గుండెపోటు లాంటి వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా  మధుమేహం ముందు వరుసలో ఉంటోంది. తాజాగా

వామ్మో.. దేశంలో ఇంతమంది షుగర్ తో బాధపడుతున్నారా..? ఈ లెక్కలు తెలిస్తే గుండె దడదడలాడల్సిందే!


జీవనశైలి మార్పుల్లో భాగంగా  తీసుకునే ఆహారం వల్ల    ఎక్కువ మంది   వ్యాధుల బారిన  పడుతున్నారు.    ముఖ్యంగా బీపీ, షుగర్, గుండెపోటు లాంటి వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా  మధుమేహం ముందు వరుసలో ఉంటోంది. తాజాగా ఐసీఎంఆర్ విడుదల చేసిన ఇండియన్ మెటబాలిక్ హెల్త్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. 

మనదేశంలో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అసాంక్రమిక వ్యాధుల భారాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన ఓ అధ్యయనంలో బీపీ, ఊబకాయం, షుగర్ తదితర సమస్యలు ఎక్కువుగా ఉన్నట్లు గుర్తించింది. మొత్తం 1,13,043 మంది నుంచి నమూనాలు సేకరించి ఈ నివేదిక రూపొందించారట. ఇందులో ఎన్నో విషయాలు తెలిసాయి. 
భారత దేశంలో 11.4 శాతం మంది.. అనగా పది కోట్లకు పైగా మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలిపింది. అలాగే 35.5 శాతం మందికి రక్తపోటు (బీపీ)తో ఇబ్బంది పడుతున్నట్లు  పేర్కొంది. వీరందరూ దాదాపు 35 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఈ వ్యాధులు బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. 
దేశంలో మధుమేహం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గోవా, పుదుచ్చేరి, కేరళ, చండీగఢ్‌, దిల్లీ మొదటి 5 స్థానాల్లో ఉండగా.. తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్‌ 19వ స్థానంలో నిలిచాయి. తెలంగాణలో 9.9%, ఆంధ్రప్రదేశ్‌లో 9.5% మందికి మధుమేహంతో బాధపడుతున్నట్లు నివేదిక తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల కన్నా కేరళ (25.5%), తమిళనాడు (14.4%), కర్ణాటక (10.6%)ల్లో మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు అధిక సంఖ్యలో ఉన్నట్లు పేర్కొంది. 
అలాగే తెలుగు రాష్ట్రాల్లో 10 నుంచి 14.9 శాతం మంది ప్రీడయాబెటిక్‌ స్థితిలో ఉన్నారని.. 30 శాతం మందికిపైగా బీపీ, 25 శాతం మందికిపైగా స్థూలకాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. 
వీటితోపాటు రక్తపోటు, ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్‌లో తెలుగు రాష్ట్రాలు రెడ్‌ జోన్‌లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. వీటికి తగిన చర్యలు తీసుకోకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతలతో పోలిస్తే పట్టణాల్లోనే అసాంక్రమిక వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మధుమేహం పట్టణ ప్రాంతాల్లో 16.4 శాతం ఉండగా.. గ్రామాల్లో 8.9 శాతం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఈ సర్వే ప్రకారం దేశంలో షుగర్ బీపీ తో బాధపడుతున్న వారు ఏ స్థాయిలో ఉన్నారు తేలుగ్గా అర్థమవుతుంది అందుకే ప్రతి ఒక్కరు జీవనశైలం మార్చుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం శారీరక శ్రమ చేయడం సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండటం అత్యవసరం.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.