Jack fruit : పనసపండు తింటే ఎన్ని లాభాలో.. చర్మంపై ముడతలు రావు..బరువు తగ్గొచ్చు..!

Jack fruit లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే రోగ నిరోధ‌క శ‌క్తికి బ‌లం చేకూరుతుంది. 100 గ్రాముల పన‌స పండ్ల‌ను తింటే మ‌న‌కు 94 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది.

Jack fruit : పనసపండు తింటే ఎన్ని లాభాలో.. చర్మంపై ముడతలు రావు..బరువు తగ్గొచ్చు..!
weight loss skin care with jack fruit


Jack fruit.. ఇంట్లో ఉందంటే.. వంటగది అంతా గుమగుమలాడిపోతుంది.. అంత వాసన వస్తుంది..వీటితో స్వీట్లు కూడా చేసుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే పనస పండ్లు తింటారు. చాలా మందికి ఆ వాసన అంటే నచ్చదు. మీరు Jack fruit ను తినకుంటే.. ఈ ఆర్టికల్‌ చదివాక ఒపినీయన్‌ మార్చుకోవచ్చు.. ఎందుకంటే పనస పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి..అనేక ఔష‌ధ విలువ‌ల‌ను, పోషకాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.   
ప‌న‌స పండ్ల‌లో విట‌మిన్ ఎ, సి, థ‌యామిన్‌, నియాసిన్‌, రైబో ఫ్లేవిన్, కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, జింక్‌, సోడియం, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక పోష‌కాలు ఉంటాయి. అలాగే వీటిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు యాంటీ క్యాన్స‌ర్‌, యాంటీ హైప‌ర్ టెన్సివ్‌, యాంటీ అల్స‌ర్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఎన్నో మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్‌, ప్రోటీన్లు కూడా ఈ పండ్ల‌లో ఉంటాయి. 
ప‌న‌స పండ్ల‌లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే రోగ నిరోధ‌క శ‌క్తికి బ‌లం చేకూరుతుంది. 100 గ్రాముల పన‌స పండ్ల‌ను తింటే మ‌న‌కు 94 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. ఈ పండ్ల‌లో ప్రోటీన్లు అద్భుతంగా ఉంటాయి.  

పనస పండు తింటే కలిగే ప్రయోజనాలు..

అధిక బ‌రువు

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ప‌న‌స పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి..వీటిల్లో కొవ్వు ఉండ‌దు. క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ పండ్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

చ‌ర్మ సంర‌క్ష‌ణ

ప‌న‌స పండ్ల‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది. కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. శుక్లాలు రాకుండా ఉంటాయి. అలాగే చ‌ర్మం సంర‌క్షించ‌బ‌డుతుంది. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే వృద్ధాప్య ఛాయ‌లు రాకుండా ఉంటాయి. య‌వ్వ‌నంగా ఉండ‌వ‌చ్చు.

హైబీపీ

ప‌న‌స పండ్ల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్‌, ఇత‌ర గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ

ప‌న‌స పండ్ల‌లో ఉండే థ‌యామిన్, నియాసిన్‌లు శ‌రీరానికి శ‌క్తిని అందిస్తాయి. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌కు బ‌లాన్నిస్తాయి. దీని వ‌ల్ల ఒత్తిడి, కండ‌రాల బ‌ల‌హీన‌తలు త‌గ్గుతాయి.

క్యాన్స‌ర్

ప‌న‌స పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, విట‌మిన్ సి ప‌లు క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకుంటాయట. లంగ్స్, బ్రెస్ట్‌, గ్యాస్ట్రిక్‌, స్కిన్‌, ప్రోస్టేట్ క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. శ‌రీరంలోని క‌ణాలు దెబ్బ‌తిన‌కుండా ఉంటాయి.

నిద్ర‌లేమి

నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు. పనస పండును తింటే.. హాయిగా పడుకోవచ్చు..ప‌నస పండ్ల‌లో ఉండే మెగ్నిషియం, ఐర‌న్‌లు నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి. నిద్ర బాగా వ‌స్తుంది. త‌ర‌చూ ఈ పండ్ల‌ను తింటే నిద్రలేమి స‌మ‌స్య ఉండ‌దు.

డ‌యాబెటిస్

ప‌న‌స పండ్లు తియ్య‌గా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. ఎందుకంటే ఈ పండ్ల ద్వారా విడుద‌ల‌య్యే చ‌క్కెర ర‌క్తంలో నెమ్మ‌దిగా క‌లుస్తుంది. కాబ‌ట్టి మ‌ధుమేహం ఉన్న‌వారు ఎలాంటి భ‌యం లేకుండా ఈ పండ్ల‌ను తిన‌వ‌చ్చు.

జీర్ణ‌క్రియ

ప‌న‌స పండ్ల‌లో ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) ఎక్కువ‌గా ఉంటుంది. దీని వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. విరేచ‌నం సాఫీగా అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. పెద్ద పేగులో పేరుకుపోయే కార్సినోజెనిక్ కెమిక‌ల్స్ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

అల్స‌ర్లు

ప‌న‌స పండ్ల‌లో యాంటీ అల్స‌రేటివ్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అల్స‌ర్లు త‌గ్గుతాయి.  

ఎముక‌ల ఆరోగ్యం

ప‌న‌స పండ్ల‌లో ఉండే కాల్షియం ఎముక‌ల‌ను ఆరోగ్యంగా చేస్తుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. అలాగే వీటిలో ఉండే విట‌మిన్ సి, మెగ్నిషియంలు మ‌నం తినే ఆహారంలో ఉండే కాల్షియాన్ని శ‌రీరం ఎక్కువ‌గా శోషించుకునేలా చేస్తాయి. దీంతో కాల్షియం లోపం ఉండదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.