గ్యాస్, మలబద్ధకాన్ని చిటికెలో నయం చేసే అద్భుతమైన చిట్కా.. ఒక్కసారి తాగితే ఆశ్చర్యపోతారు..

ఈరోజుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎవరు ఇష్టపడరు.. నోటికి రుచిగా ఉండే ఆహారాన్ని తింటూ అనేకరకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్ల తో పాటు, టైం టూ టైం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

గ్యాస్, మలబద్ధకాన్ని చిటికెలో నయం చేసే అద్భుతమైన చిట్కా.. ఒక్కసారి తాగితే ఆశ్చర్యపోతారు..


ఈరోజుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎవరు ఇష్టపడరు.. నోటికి రుచిగా ఉండే ఆహారాన్ని తింటూ అనేకరకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్ల తో పాటు, టైం టూ టైం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం,జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన మనలో చాలా మంది పడుతున్నారు.. ఈ సమస్యలు రాక ముందు ఒకే కానీ వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

How to deal with Gas Problem | Best Gastrologist Dr. Vatsal Mehta


తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేసే ఈచిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలను, ఒక టీ స్పూన్ జీలకర్రను, 4 మిరియాలను, 4 లవంగాలను, చిటికెడు పసుపును వేయాలి. తరువాత ఈ నీటిని స్టవ్ మీద ఉంచి అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత దీనిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు ఒకటి నుండి రెండు సార్లు తీసుకోవచ్చు.

అలాగే దీనిని ఎవరైనా కూడా తీసుకోవచ్చు..ఈ విధంగా కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్య తలెత్తిన వెంటనే ఈ కషాయన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వారానికి కనీసం రెండు రోజుల పాటు ఈ కషాయాన్ని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి...ఇక అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.