ఆ డ్రింక్స్ తాగితే గుండె జబ్బులు పక్కా.. ఆ రోగాలు కూడా వస్తాయట!

కూల్ డ్రింక్స్.. వీటిని తాగే వారి సంఖ్య  కాస్త ఎక్కువే. గొంతు ఎండిపోయిన, స్నేహితులను కలిసినప్పుడు, రెస్టారెంట్‌కు వెళ్లిన‌ప్పుడు ఇలా.. పలు సందర్భాల్లో  కూల్​ డ్రింక్స్​ తాగుతాం. వేసవి  ఇంకా ఎక్కువగా తాగుతాం.  కానీ   అతిగా కూల్​ డ్రింక్స్​ తాగడం వల్ల దీర్ఘ‌కాలిక వ్యాధులు వ‌స్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు వైద్యులు.

ఈ డ్రింక్స్ లివ‌ర్​ను దెబ్బ‌తీస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాదు మ‌ధుమేహంతో పాటు గుండె జ‌బ్బులు కూడా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని  అంటున్నారు. సాఫ్ట్ డ్రింక్ నుంచి డైట్ సోడా వ‌ర‌కు.. వాటి త‌యారీలో వాడే చ‌క్కెరతో పాటు ఇత‌ర ర‌సాయ‌నాలు మ‌న ఆరోగ్యానికి హాని చేస్తాయ‌ని చెబుతున్నారు.
అధికంగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఎక్కువ గా క్యాల‌రీలు పెరిగి బ‌రువు పెరుగుతారట. ఫలితంగా డ‌యాబెటిస్, బీపీ, గుండె జ‌బ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పురుషుల‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం 20 శాతం ఉంటుంది.  
ఈ కూల్ డ్రింక్స్ లో, శీత‌ల పానియాల్లో అధికంగా ఉండే షుగ‌ర్ శరీరానికి చాలా ప్ర‌మాద‌క‌రం. ముఖ్యంగా దీని వ‌ల్ల దంత స‌మ‌స్య‌లూ వ‌స్తాయి. చిగుళ్లు వ‌దులై.. దంతాలు ఊడిపోయే ప్ర‌మాద‌ముంది. ఆహారం త‌క్కువ తీసుకుని డ్రింక్స్ అధికంగా తాగే వారికి స్థూల‌కాయం త‌ప్ప‌ని స‌రిగా వస్తుంది. కూల్ డ్రింక్స్  ఉన్న ఫాస్ప‌రిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్య‌వస్థ దెబ్బ‌తింటుంది. 
కెఫిన్ వ‌ల్ల అధిక రక్త‌పోటు, త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌నకు వెళ్లాల్సి రావ‌టం జరుగుతుంది. అంతేకాకుండా ఆ ర‌సాయ‌నాలు ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు దారితీస్తాయి. కూల్​డ్రింక్స్​లోని అధిక ఫ్ర‌క్టోజ్ వ‌ల్ల బ్రెయిన్​లోని హిప్పోక్యాంప‌స్ ప‌రిమాణం త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా మ‌తిమ‌రుపు వచ్చే అవకాశం ఉంది. డీహైడ్రేష‌న్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి  అనేక మంది కూల్​డ్రింక్స్​ను తాగుతారు. కానీ అందులోని కెఫిన్, చక్క‌ెర‌లు మ‌రింత డీహైడ్రేష‌న్​కు దారితీస్తాయి. 
 కాబట్టి ఈ డ్రింక్స్ బ‌దులు... ఖ‌ర్బుజ, పుచ్చ‌కాయ‌, నిమ్మ, ఇత‌ర పండ్ల ర‌సాలు, చెరుకు ర‌సం తీసుకోవాలి. దాహ‌మేస్తే సాధ్య‌మైనంత వ‌ర‌కు మంచినీరు తాగాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.