మలం నలుపు రంగులో వస్తుందా..? ఓరినాయనో పెద్ద సమస్యే..!!

ఈరోజుల్లో చాలా మంది.. బాత్రుమ్‌లోకి ఫోన్లు తీసుకెళ్లి.. పని అయ్యేవరకూ ఫోన్లోనే కళ్లు పెట్టి చూస్తుంటారు. అసలు బాత్రూమ్‌లోకి ఫోన్‌ తీసుకెళ్లడం చాలా చెడ్డ అలవాటు.. మీరు ఏ పని మీద వెళ్లారో ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి.

మలం నలుపు రంగులో వస్తుందా..? ఓరినాయనో పెద్ద సమస్యే..!!


ఈరోజుల్లో చాలా మంది.. బాత్రుమ్‌లోకి ఫోన్లు తీసుకెళ్లి.. పని అయ్యేవరకూ ఫోన్లోనే కళ్లు పెట్టి చూస్తుంటారు. అసలు బాత్రూమ్‌లోకి ఫోన్‌ తీసుకెళ్లడం చాలా చెడ్డ అలవాటు.. మీరు ఏ పని మీద వెళ్లారో ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి. మలం ఎలా వస్తుంది, మూత్రం ఏ రంగులో ఉంటుందో గమనించుకోవాలి.. మీరు ప్రతిసారి ఫోన్ చూస్తుంటే.. చాలా సమస్యలు వస్తాయి.. మూత్రంలో నురగ వస్తుందా..కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు.. ఇంకా మలం నలుపు రంగులో వస్తుందా..? ఇది కూడా పెద్ద సమస్యే.. మలం నల్లగా రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. దీని కంటే.. ముందు మీరు బాత్రూమ్‌లోకి ఫోన్‌ తీసుకెళ్లడం మానేయండి..!! 

మ‌లం న‌లుపు రంగులో వస్తుందా ? అయితే అందుకు కార‌ణాల‌ను తెలుసుకోండి..!

ఐర‌న్ ట్యాబ్లెట్లు వేసుకునే వారికి, ఆయుర్వేద మందుల‌ను మింగే వారికి కూడా స‌హ‌జంగానే మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది. కానీ ఈ విధంగా చేయ‌ని వారికి మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుందంటే అనుమానించాల్సిందే. అది తీవ్ర‌మైన అనారోగ్య స్థితి వ‌ల్లే అయి ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో పై భాగంలో లోప‌ల ర‌క్త‌స్రావం అవుతున్నా లేదా అల్స‌ర్లు తీవ్రంగా ఉన్నా, గ్యాస్ట్రైటిస్ స‌మ‌స్య వంటి కార‌ణాల వ‌ల్ల మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది. అలాగే జీర్ణ ర‌సాల‌తో ర‌క్తం క‌లిసినా మ‌లం న‌లుపు రంగులో వ‌స్తుంది.

అయితే ఐరన్ ట్యాబ్లెట్లు, మందులు, ఆహారాల వ‌ల్ల కాకుండా సాధార‌ణంగా మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంటే అందుకు పైన చెప్పిన స‌మ‌స్య‌ల‌ను కార‌ణాలుగా భావించాలి. 

చిన్న పేగుల్లో ర‌క్త స‌ర‌ఫ‌రా త‌గ్గిపోవ‌డం, ర‌క్త‌నాళాలు ఆకృతిని కోల్పోవ‌డం, పేగుల్లోని ర‌క్త నాళాల్లో స‌మ‌స్య‌లు వంటి కార‌ణాల వ‌ల్ల కూడా మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది.

ఇక ఎరుపు రంగులో మ‌లం వ‌స్తుంటే అది కూడా తీవ్ర‌మైన స‌మ‌స్యే.. న‌లుపు లేదా ఎరుపు రంగుల్లో మ‌లం వ‌స్తుంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌రాదు. వెంటనే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఏదైనా ఉన్న‌ట్లు తేలితే అందుకు అనుగుణంగా మందుల‌ను వాడాలి. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త వ‌హించ‌వ‌చ్చు.

శ‌రీరంలో క్యాన్స‌ర్లు లేదా ట్యూమ‌ర్లు ఏర్ప‌డినా కొంద‌రికి మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది. ఈ విష‌యంలో అస్స‌లు అశ్ర‌ద్ధ చేయ‌రాదు. వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

మలం నలుపు, ఎరుపు రంగులో రావడం అనేది అస్సలు చిన్న విషయం కాదు.. కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.