Dental Plaque : దంతాలపై ఉండే గార, పాచి..ఇలా చేస్తే వారంలో మాయం.!

Dental Plaque : పొద్దున లేవగానే అందరూ చేసే పని.. పళ్లు తముకోవడం.. చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం.. అయినా.. కొంతమంది దంతాలు ఇప్పటికీ.. పచ్చగానే ఉంటాయి.. ఇవి పచ్చగా మారేందుకు.. సరిగ్గా బ్రష్‌ చేయకపోవడం ఒక కారణం అయితే

Dental Plaque : దంతాలపై ఉండే గార, పాచి..ఇలా చేస్తే వారంలో మాయం.!


Dental Plaque : పొద్దున లేవగానే అందరూ చేసే పని.. పళ్లు తముకోవడం.. చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం.. అయినా.. కొంతమంది దంతాలు ఇప్పటికీ.. పచ్చగానే ఉంటాయి.. ఇవి పచ్చగా మారేందుకు.. సరిగ్గా బ్రష్‌ చేయకపోవడం ఒక కారణం అయితే.. తాగే నీళ్లు కూడా ఒక కారణం.. ఏది ఏమైనా గారపట్టిన దంతాలతో ఇబ్బందిగానే ఉంటుంది.. మార్కెట్‌లో టీత్‌ వైటనింగ్‌ టూత్‌ పేస్టులు అన్నీ వాడేసి ఉంటారు.. అయినా పెద్దగా ఏం తేడా లేదా..? ఈ సింపుల్‌ ఇంటి చిట్కాను ట్రై చేయండి.. మీ దంతాలు కొద్ది రోజుల్లోనే తెల్లగా మెరిసిపోతాయి.  

మ‌న ఇంట్లోనే టూత్ పేస్ట్‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల దంతాల, చిగుళ్ల స‌మ‌స్యల‌ నుంచి బ‌య‌ట ప‌డ‌డ‌మే కాకుండా దంతాలు తెల్ల‌గా కూడా మార్చుకోవ‌చ్చు. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే టూత్ పేస్ట్‌ను ఎలా త‌యారు చేసుకోవాలంటే.. ఈ టూత్ పేస్ట్‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం బేకింగ్ సోడాను, కొబ్బ‌రి నూనెను, పెప్ప‌ర్ మింట్ నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. 
ముందుగా ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకోవాలి. త‌రువాత అందులో కొబ్బ‌రి నూనె, పెప్ప‌ర్ మింట్ నూనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని టూత్ బ్ర‌ష్‌తో తీసుకుని రోజూ వారిలా దంతాల‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. 
వేడి, చ‌ల్ల‌టి ఆహార ప‌దార్థాల‌ను తిన‌ప్పుడు చాలా మందిలో దంతాలు జివ్వుమంటాయి. అలాంటి వారు ఈ టూత్ పేస్ట్‌ను వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ టూత్ పేస్ట్‌ను వాడ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మార‌తాయి. 
దంతాల స‌మ‌స్య‌ల‌ను తొల‌గించే మ‌రికొన్ని చిట్కాలు..
పాల‌ను తాగ‌డం వ‌ల్ల త‌గినంత క్యాల్షియం ల‌భించి దంతాలు ధృడంగా మార‌తాయి. దంతాల‌పై ఉండే ఎనామిల్ పొర‌ను తెల్ల‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ పాలు దంతాల‌కు చాలా సేపు అతుక్కుని ఉంటాయి. క‌నుక పాలు తాగిన వెంట‌నే దంతాల‌ను శుభ్రంగా చేసుకోవాలి. 
విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నారింజ పండును తీసుకోవ‌డం వ‌ల్ల దంతాల‌, చిగుళ్ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. 
కాఫీ, టీ లు తాగిన త‌రువాత నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి. దంతాలు రంగు మార‌కుండా ఉంటాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.