Vijayasaram tree : 'విజయసారం' చెట్టును చూసే ఉంటారుగా..! అనేక సమస్యలను తగ్గించగలదు తెలుసా..?

ఆయుర్వేదంలో చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటిదే Vijayasaram చెట్టు. ఈ చెట్టు కాండం, ఆకులు, బెరడు, జిగురు, పువ్వులు అన్నీ ఉపయోగకరమే. వాటితో అనేక రకాల అనారోగ్య స‌మస్యలను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే Vijayasaram tree తో

Vijayasaram tree : 'విజయసారం' చెట్టును చూసే ఉంటారుగా..! అనేక సమస్యలను తగ్గించగలదు తెలుసా..?
Vijayasaram tree can reduce many problems


మన చుట్టూ ఉండే చెట్లు, మొక్కల్లో ఎన్నో రకలా ఔషధగుణాలు దాగి ఉన్నాయి. వాటిని మనం గుర్తించలేదేమో కానీ..మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. వాటితో వైద్యం చేశారు. ఆయుర్వేదంలో చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటిదే విజయసారం చెట్టు. దీన్ని మీరు చాలాసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ చెట్టు వల్ల లాభాలు ఉంటాయి అని మాత్రం అస్సలు అనుకోని ఉండరు కదా..! ఈ వృక్షాలు సుమారుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ చెట్టు కాండం, ఆకులు, బెరడు, జిగురు, పువ్వులు అన్నీ ఉపయోగకరమే. వాటితో అనేక రకాల అనారోగ్య స‌మస్యలను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే విజయసారం చెట్టుతో ఏయే ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా..!

విజయసారం ఆకుల్లో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ అల్సర్‌ లక్షణాలు ఉంటాయి. అందువల్ల అన్ని రకాల అల్సర్లు తగ్గుతాయి. విజయసారం ఆకులను పేస్ట్‌లా చేసి గాయాలపై రాస్తే అవి త్వరగా మానుతాయి. ఆకులను నమిలి తినడం వల్ల నోట్లో అల్సర్లు ఉండవు.
ఆర్థరైటిస్‌ నొప్పులు ఉన్నవారు విజయసారం ఆకులను పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న ప్రదేశంపై రాస్తుండాలి. దీంతో నొప్పులు తగ్గుతాయట..విజయసారం బెరడు పొడితో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
విజయసారం చెట్టు ఆకులను నమలడం వల్ల తీపి, జంక్‌ ఫుడ్‌ తినాలనే యావ తగ్గుతుందట..సగం రోగాలకు జంక్‌ఫుడ్స్‌ కారణం కాబట్టి.. మిమ్మల్ని మీరు కంట్రోల్‌ చేసుకోకలేకపోతే ఈ టిప్‌ ఫాలో అవ్వండి.!
అధిక బరువును తగ్గించడంలో విజయసారం అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలోని ఆమ దోషాలు తగ్గుతాయి. వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అతిగా తినే వ్యాధి తగ్గుతుంది.. కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. విజయసారం పొడి లేదా ఆకులను రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
విజయసారం ఆకులు, పొడిలో యాంటీ ఫ్లాట్యులెంట్‌ లక్షణాలు ఉంటాయి. అందువల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణాశయంలో గ్యాస్‌ ఏర్పడదు. 
డయాబెటిస్‌ను తగ్గించండంలో విజయసారం చెట్టు అద్భుతంగా పనిచేస్తుందట.. ఈ చెట్టుకు చెందిన బెరడు పొడి లేదా ఆకుల రసంను రోజూ రెండు పూటలా భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీంతో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. క్లోమగ్రంథిలోని బీటా కణాలు ఉత్తేజం అవుతాయి. డయాబెటిస్‌ నుంచి బయట పడవచ్చట..
 
విజయసారం బెరడు, ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. చర్మ సమస్యలు తగ్గుతాయి. ఎగ్జిమా, దురద, బొబ్బలు, సోరియాసిస్‌, స్కేబిస్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. 
విజయసారం ఆకుల రసం లేదా బెరడు పొడిని ఫేస్‌ ప్యాక్‌లా వాడవచ్చు. దీంతో చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
జుట్టు పెరుగుదలను విజయసారం చెట్టు బాగా పనిచేస్తుందట.. ఈ చెట్టు ఆకుల్లో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఆకుల నుంచి తీసిన రసాన్ని జుట్టుకు రాస్తే.. జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. దురద, చుండ్రు నుంచి బయట పడవచ్చు.

ఎలా వాడాలి..?

విజయసారం బెరడు పొడి, ట్యాబ్లెట్లు మనకు షాపుల్లో లభిస్తాయి. 
పొడిని రోజూ 3 నుంచి 5 గ్రాముల మోతాదులో వేడి నీటితో లేదా తేనెతో తీసుకోవచ్చు. 
ఆకుల రసం అయితే రోజుకు 1-2 టీస్పూన్లు చాలు. 
బెరడు కషాయం అయితే రోజుకు 50-100 ఎంఎల్‌ తాగవచ్చు. 
ట్యాబ్లెట్లు అయితే రోజుకు 1-2 వాడవచ్చు. 
రోజూ రాత్రి ఒక గ్లాస్‌ నీటిలో విజయసారం బెరడును వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపునే తాగాలి. దీంతో డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది.
ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మీకు అవసరం అనిపిస్తే ట్రై చేసి చూడండి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.