పరగడుపున జీలకర్ర నీళ్లు తాగుతున్నారా.. !

రోజు ఉదయం లేవగానే పరగడుపున cumin వేసి మరిగించిన నీళ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.. శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచేందుకు cumin water ప‌నిచేస్తాయి.

పరగడుపున జీలకర్ర నీళ్లు తాగుతున్నారా.. !
Drinking cumin water at morning


ప్రతిరోజు పరగడుపున వేడి నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది..  అయితే ఈ క్రమంలోనే cumin water తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. 

రోజు ఉదయం లేవగానే పరగడుపున cumin వేసి మరిగించిన నీళ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.. శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచేందుకు జీల‌క‌ర్ర నీళ్లు ప‌నిచేస్తాయి. ఈ నీటిలో యాంటీ కంజెస్టివ్ ల‌క్ష‌ణాలు ఉంటాయి.  ముఖ్యంగా ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.. రోజంతా ఏ ఆహారం తీసుకున్న ఎలాంటి సమస్య లేకుండా చక్కగా అరిగిపోతుందని తెలుస్తోంది..  అంతేకాకుండా మలబద్ధకం సమస్య వేధించే వాళ్ళు కూడా ఈ నీటిని తాగడం వల్ల సమస్య తీరుతుందని తెలుస్తోంది.. 

  • అలాగే పాలిచ్చే త‌ల్లులు రోజూ జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి.
  • జీల‌క‌ర్ర‌లో ఐర‌న్ స‌మృద్ధిగా ఉంటుంది.
  • ఇది ర‌క్త‌హీన‌త రాకుండా చూస్తుంది.
  • జీలకర్ర నీటిని తాగితే గ్యాస్, అసిడిటీ, అజీర్తి, కడుపులో వికారం, కడుపులోని అల్సర్లు వదిలిపోతాయి.
  • అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడే వాళ్లకు కూడా ఈ నీరు చక్కని పరిష్కారం..
  • జీల‌క‌ర్ర‌లో ఐర‌న్, ఫైబ‌ర్‌లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల జీల‌క‌ర్ర నీటిని తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
  • అలాగే నెలసరి సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని తాగడం వల్ల క్రమం తప్పకుండా నెలసరి వస్తుందని తెలుస్తోంది .
  • అంతేకాకుండా చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యి కాంతివంతమైన చర్మం సొంతమవుతుందని తెలుస్తోంది .
  • అలాగే మొహం పైన మొటిమలు మచ్చలతో బాధపడేవారు ఈ నీటిని తాగటం వల్ల ఆ సమస్య నుంచి తొందరగానే బయటపడవచ్చని చెబుతున్నారు నిపుణులు..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.