గోంధ్‌ కటిరా: ఆయుర్వేదంలో పవర్‌ఫుల్‌ ఔషదం..నడుం నొప్పి మాటే ఉండదు

ఆయుర్వేదంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నేడు హలోపతి వచ్చిన తర్వాత ఆయుర్వేద వైద్యం చేయించుకునే వారి సంఖ్య తగ్గింది కానీ మన పూర్వీకులు ఈ ఆయుర్వేదం చిట్కాలను పాటించే ఏ రోగాలు లేకుండా ఒక్కొక్కరు డజను మంది పిల్లలను కని, పెంచి వందేళ్ల వరకూ హ్యాపీగా బతికేశారు. ఈరోజుల్లో చాలా మందికి

గోంధ్‌ కటిరా: ఆయుర్వేదంలో పవర్‌ఫుల్‌ ఔషదం..నడుం నొప్పి మాటే ఉండదు


ఆయుర్వేదంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నేడు హలోపతి వచ్చిన తర్వాత ఆయుర్వేద వైద్యం చేయించుకునే వారి సంఖ్య తగ్గింది కానీ మన పూర్వీకులు ఈ ఆయుర్వేదం చిట్కాలను పాటించే ఏ రోగాలు లేకుండా ఒక్కొక్కరు డజను మంది పిల్లలను కని, పెంచి వందేళ్ల వరకూ హ్యాపీగా బతికేశారు. ఈరోజుల్లో చాలా మందికి నడుము నొప్పి సమస్య ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా జాబ్‌ చేసేవాళ్లు అయితే మరీను. అన్ని గంటలు సిస్టమ్‌ ముందు కుర్చోని ఎన్నో రోగాల భారిన పడుతున్నారు. విరిగిన ఎముకలను సైతం నయం చేయగల శక్తి ఆయుర్వేదంలో ఒక ఔషధానికి ఉంది. దానిపేరే గోంధ్‌ కటిరా.  
ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిన ప‌దార్థాల్లో ఇది ఒక‌టి. ఈరోజు మనం దీని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇది కచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది.
విరిగిన ఎముకలను త్వరగా అతికిస్తుంది..నడుంనొప్పి మాయం..దీని గురించి తెలుసా?  - Jeevanavedam | Health News in Telugu | Health Tips
గోంధ్ మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో, ఆన్ లైన్ లో సుల‌భంగా ల‌భిస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గోంధ‌క‌టిరాలో కార్బోహైడ్రేట్స్‌తో పాటు క్యాల్షియం, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఉంటాయి. దీనిని వేయించి పొడిగా చేసి పాల‌ల్లో క‌లిపి తీసుకోవ‌చ్చు. అలాగే దీనిని వివిధ ర‌కాల ల‌డ్డూల‌లో కూడా వేసి తీసుకోవ‌చ్చు. ఒక టీ స్పూన్ నెయ్యిలో రెండు టీ స్పూన్ల క‌టిరా వేసి వేయించాలి. క‌టిరా చ‌క్క‌గా వేగి పొంగిన త‌రువాత దీనిని పొడిగా చేయాలి. ఈ పొడిని ఒక గ్లాస్ ఆవు పాల‌ల్లో వేసి క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.
గోంధ్ క‌టిరాను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా, ఆరోగ్యంగా త‌యాయ‌వుతాయి. కీళ్ల మ‌ధ్య గుజ్జును పెంచే గుణం కూడా ఈ క‌టిరాకు ఉంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించ‌డంలో క‌టిరా మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. 
క‌టిరాను తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, ఫ్లూ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు తగ్గుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. బాలింత‌లు ఈ గోంధ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది. 
శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను తొల‌గించి శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటును పెంచ‌డంలో కూడా గోంధ్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. 
దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి కూడా మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. 
గుండెపోటు రాకుండా ఆరిక‌ట్ట‌డంలో కూడా గోంధ్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. శ‌రీరానికి శ‌క్తిని ఇవ్వ‌డంలో, శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో గోంధ్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. 

అందానికి కూడా గోంధ్

దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. 
వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. జుట్టు బ‌లంగా త‌యార‌వుతుంది. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూశారు కదా..! ఏవేవో రసాయనాలతో చేసిన మందులు వాడేకన్నా ఇలాంటి నాచురల్గా లభించేవి వాడటం వల్ల అటు సమస్య తగ్గుతుంది, ఇటు సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా రావు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.