Sleep Tips : రాత్రి 8-10 లోపే పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Sleep Tips : నిద్ర మనిషి ఆరోగ్యాన్ని శాసిస్తుంది.. మీరు ఎంత బాగా పనిచేయాలి అన్నా.. మీకు కానీ నిద్రమత్తు పట్టిందంటే.. ఇక ఆ పని అస్సామే.. మహా అయితే ఒక గంట ఎలాగొలా ఆపుకుంటాం.. ఒకవేళ బలవంతంగా నిద్ర ఆపుకున్నా...

Sleep Tips : రాత్రి 8-10 లోపే పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?


Sleep Tips : నిద్ర మనిషి ఆరోగ్యాన్ని శాసిస్తుంది.. మీరు ఎంత బాగా పనిచేయాలి అన్నా.. మీకు కానీ నిద్రమత్తు పట్టిందంటే.. ఇక ఆ పని అస్సామే.. మహా అయితే ఒక గంట ఎలాగొలా ఆపుకుంటాం.. ఒకవేళ బలవంతంగా నిద్ర ఆపుకున్నా... చేసే పని మీద శ్రద్ధ ఉండదు.. ఏదో ఒకటి చేసి కంప్లీట్‌ చేద్దాం అనుకుంటాం.. మనిషి ఆరోగ్యానికి కనీసం 8 గంటల నిద్ర అవసరం అంటారు.. మనం ఈ కాన్సప్ట్‌ ఫాలో అవుతాం కానీ.. అవి ఏ ఎనిమిది గంటలు అనేది మాత్రం పక్కన పెడతాం.. రాత్రి 2, 3 గంటలకు పడుకోని.. ఉదయం 11 గంటలకు లేసినా ఎనిమిది గంటలు అవుతుంది..కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.. మీరు ఊర్లలో చూసినట్లైతే.. సాయంత్రం 7- 8 మధ్యలోనే తినేస్తారు.. 9 గంటల కంతా నిద్రపోతారు. ఉదయం 5-6కే లేస్తారు..నిజానికి ఇదే మంచి పద్ధతి.. మీరు కానీ 8-10 లోపే పడుకున్నారంటే.. మీ ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా మేలు జరుగుతుందో చూద్దామా..!మనం త్వరగా పడుకున్నప్పుడు, మన శరీరానికి విశ్రాంతి, మళ్లీ తిరిగి శక్తి పొందడానికి తగినంత సమయం ఉంటుంది.. ఇది మెరుగైన మానసిక స్థితి, పెరిగిన ఉత్పాదకత సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తగినంత నిద్ర పొందడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు దూరం ఉండొచ్చు.
Eight Health Benefits of Sleep | Sleep Foundation
త్వరగా పడుకోవడం వల్ల మన శరీరంలోని హార్మోన్లు, ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మన ఒత్తిడి ప్రతిస్పందనకు కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగా రాత్రి ప్రారంభ గంటలలో తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకోవడం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
మంచి నిద్ర వల్ల..తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇవి అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో పోరాడడంలో కీలకమైనవి. తగినంత నిద్ర పొందడం వల్ల మన శరీరం అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. తద్వారా మన సాధారణ దినచర్యకు త్వరగా తిరిగి రావడానికి వీలు కల్పిస్తుంది.
త్వరగా పడుకోవడం మన ఆకలిని నియంత్రించడంలో, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడంలోనూ సహాయపడుతుంది. మనకు తగినంత నిద్ర లేనప్పుడు, మన శరీరం ఆకలి హార్మోన్ గ్రెలిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మేలుకుగా ఉన్నంతసేపూ..ఏదో ఒకటి తినలనిపిస్తుంది.. సంపూర్ణత్వాన్ని సూచించే లెప్టిన్ హార్మోన్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది అతిగా తినడం, బరువు పెరగడానికి దారితీస్తుంది.
నిద్ర లేకపోవడం వల్ల పెరిగిన ఆందోళన.., నిరాశకు దారితీస్తుంది. త్వరగా నిద్రపోవడం ఈ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. తగినంత నిద్ర పొందడం వల్ల మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపే శక్తి, ప్రేరణ పొందడంలో కూడా సహాయపడుతుంది.
మీరు కానీ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య పడుకున్నారంటే.. ఉదయం 6-7 గంటలకే లేస్తారు. అంత ఉదయం లేవడం వల్ల ఎన్ని పనులు అయినా చేసుకోవచ్చు. అరే లేచే సరికి.. సగం రోజు అయిపోతే..ఇంక ఏం ఉంటది చెప్పండి. చాలా మంది ఉద్యోగం చేసేవాళ్లు నైట్‌ షిఫ్ట్‌ అలవెన్స్‌లకోసం నైట్‌ షిప్ట్‌లు చేస్తుంటారు. ఇలా అస్సలు చేయకండి. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది చేయగలగుతున్నారు. కానీ ఇలానే రాత్రుళ్లు మేల్కొని పనులు చేయడం వల్ల అటు అందం ఇటు ఆరోగ్యం రెండూ పోతాయి. ఎంత పని అయినా వీలైనంత వరకూ మార్నింగ్‌ చేసేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.