Moringa seeds : ములక్కాయ విత్తనాలతో తాగే నీటిని క్లీన్‌ చేసుకోవచ్చు తెలుసా..?

Moringa seeds : ములక్కాయలతో చేసిన సాంబార్‌ తింటే ఆహా.. ఏమన్నా ఉంటుందా..? ఆ టేస్టే వేరు. ములక్కాయలతో ఏం చేసినా అదిరిపోతుంది. ములగ చెట్టు, ములగ ఆకులు అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ మీకు ములక్కాయలో ఉండే విత్తనాల గురించి తెలుసా..?

Moringa seeds : ములక్కాయ విత్తనాలతో తాగే నీటిని క్లీన్‌ చేసుకోవచ్చు తెలుసా..?
Drinking water cleaning with moringa seeds


Moringa seeds : ములక్కాయలతో చేసిన సాంబార్‌ తింటే ఆహా.. ఏమన్నా ఉంటుందా..? ఆ టేస్టే వేరు. ములక్కాయలతో ఏం చేసినా అదిరిపోతుంది. ములగ చెట్టు, ములగ ఆకులు అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ మీకు ములక్కాయలో ఉండే విత్తనాల గురించి తెలుసా..? ఇవి కూడా మనకు మంచే చేస్తాయట.. వీటితో నీటిని శుభ్రంగా చేసుకోవచ్చట. మున‌గ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాలతో నీటిని శుభ్రం చేసుకోవ‌చ్చనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. అవును.. ఈ విత్త‌నాల‌తో రోజూ మ‌నం తాగే నీటిని శుభ్రం చేసుకుంటే.. అవి స్వ‌చ్ఛంగా మారుతాయి. దీంతో నీటి వ‌ల్ల మ‌నకు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అయితే ఈ మున‌గ‌కాయ‌ల విత్త‌నాల‌తో నీటిని ఎలా శుభ్రం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌గ‌కాయ‌ల నుంచి విత్త‌నాలను తీసి నీడలో ఎండ‌బెట్టాలి. అనంత‌రం వాటిపై ఉండే పొట్టును తీసేసి లోప‌లి విత్త‌నాన్ని బ‌య‌ట‌కు తీయాలి. ఇలా సేక‌రించిన విత్త‌నాల‌ను పొడి చేసుకోవాలి. దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేయాలి. అందులో నుంచి 150 మిల్లీగ్రాముల మోతాదులో పొడిని తీసుకుని కొద్దిగా నీటిని క‌లిపి జ్యూస్‌లా చేయాలి. దాన్ని మ‌నం శుభ్రం చేయాల‌నుకునే నీటిలో పోయాలి. త‌రువాత 30 సెక‌న్ల పాటు బాగా క‌ల‌పాలి. అనంత‌రం పాత్ర‌ను అలాగే ఉంచాలి.

ఇలా ఆ పాత్ర‌ను గంట సేపు అలాగే క‌దిలించ‌కుండా ఉంచితే.. మనం క‌లిపే పొడి అడుగు భాగంలో చేరుతుంది. పైన స్వ‌చ్ఛ‌మైన నీరు వస్తుంది. పైన ఉండే నీటిని సేక‌రించి పక్క‌న పెట్టుకోవాలి. ఆ నీరు చాలా శుభ్రంగా ఉంటుంది. మ‌నం తాగే నీటిలో ఉండే కాలుష్య కార‌కాలు, వ్య‌ర్థాలు, సూక్ష్మ క్రిములు ఏం ఉన్నా.. మొత్తం ఆ పాత్ర‌కు అడుగు భాగంలో చేరి ఉంటాయి. పైన ఉండే నీరు చాలా స్వ‌చ్ఛంగా ఉంటుంది. దాన్ని సేకరించి తాగాలి. ఈ నీరు చాలా శుభ్రంగా ఉంటుంది. మ‌న‌కు నీటితో ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.

మేం తాగే నీళ్లు క్లీన్‌గానే ఉంటాయి అనుకుంటారు.. కానీ ఈరోజుల్లో నీరు కూడా కలుషితం అవుతుంది. వ్యర్థాలు, క్రిములే..పైకి మాత్రం క్లీన్‌గానే కనిపిస్తారు. మున‌గ‌కాయ‌ల విత్త‌నాల్లో యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ వైర‌ల్, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. ఆ విత్త‌నాలు నీటిని శుభ్రం చేసేందుకు శ‌క్తివంతంగా పనిచేస్తాయి. ఇక 150 మిల్లీగ్రాముల మున‌గ‌కాయ విత్త‌నాల పొడితో 1 లీట‌ర్ నీటిని శుభ్రం చేయవ‌చ్చు. అందుకు అనుగుణంగా పొడిని సిద్ధం చేసుకుని రోజూ ఉప‌యోగించ‌వ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.