శరీరానికి సోడియం, పొటాషియం ఎందుకు కావాలి?

ప్రకృతిలో దొరికే అన్ని ఆహార పదార్థాలు శరీరానికి చాలా అవసరం. అంతేకాకుండా సోడియం, పోటాషియం కూడా అన్నింటికన్నా ముఖ్యం. ఈ రెండు లవణాలు అతి ప్రధానమైనవి. పోటాషియం అనేది చాలా లాభాలు కలిగిస్తుంది. సోడియం సాధారణంగా

శరీరానికి సోడియం, పొటాషియం ఎందుకు కావాలి?


ప్రకృతిలో దొరికే అన్ని ఆహార పదార్థాలు శరీరానికి చాలా అవసరం. అంతేకాకుండా సోడియం, పోటాషియం కూడా అన్నింటికన్నా ముఖ్యం. ఈ రెండు లవణాలు అతి ప్రధానమైనవి. పోటాషియం అనేది చాలా లాభాలు కలిగిస్తుంది. సోడియం సాధారణంగా అయితే నేచురల్‌గానే అన్ని ఆహార పదార్థాలు కొంత కంటెంట్‌ ఉంటుంది. అంతే కాకుండా మనం ఉప్పు రూపంలో వండుకుంటాం. దానివల్ల కొంత మన శరీరంలోకి వెళ్తుంది. మరీ పొటాషియం ఎలా అందుతుందంటే...కూరగాయల తొక్కలలో ఉంటుంది. అది మనం తెలియక అన్నింటిని తొక్కలు తీసి వాడుకుంటాం.

Should I salt My Food? Let's Hear the Truth! - Dr Bret Scher

బాగా లేతగా ఉన్న కూరగాయలను తొక్కలు తీయకుండానే వండేసుకోవాలి. ముదురుగా ఉంటే తొక్కలు తీసేయవచ్చు. లేతగా ఉంటే మాత్రం కడిగేసుకుని వాడుకోవాలి. దాని తొక్కల్లో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. పొటాషియం వల్ల శరీరానికి 7 ముఖ్యమైన లాభాలున్నాయి. అయితే శరీరానికి రోజూ 2500 మిల్లీ గ్రాముల పొటాషియం అవసరం.

అరటిపండు తొక్కలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అయితే తొక్క తీసేయడం వల్ల సగం పోతుంది. అందుకోసం అరటిపండు బాగా మాగాక..నెమ్మదిగా తొక్క తీస్తే కొంచెం లేయర్‌ పండుకు అంటుకుంటుంది. దాన్ని అలానే తినేయాలి. పొటాషియం అనేది కూరగాయలను వండేస్తే పోతుంది. ఉడికిస్తే సగం పోతుంది. ఫ్రై చేస్తే ఇంకాస్త పోతుంది. నూనెలో దేవితో ఉన్నది కాస్త పోతుంది. ఇంక మనం ఎంత రుచిగా తిన్నా.....వ్యర్థం తిన్నట్లే.

Balancing Sodium and Potassium for Healthy Blood Pressure

నేచురల్‌ ఫుడ్‌ వల్ల పొటాషియం కడుపులోకి వెళ్తుంది. పచ్చికూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. మొలకలు, ఫ్రూట్స్‌, కొబ్బరినీళ్ల వల్ల లభిస్తుంది. 80శాతం పొటాషియం మజిల్స్‌లో ఉంటుంది. 5 శాతం నరాల్లో ఉంటుంది. 15 శాతం లివర్‌లోనూ, ఎర్రరక్తకణాల్లో ఉంటుంది.

శరీరంలో నీళ్లను బ్యాలెన్స్‌ చేసేందుకు సోడియం, పొటాషియం కావాలి. విరేచనాలు, వాంతులు అయినప్పుడు నీళ్ల రూపంలో ఈ 2 లవణాలు పోతాయి. రక్తం శుభ్రంగా ఉండటానికి పొటాషియం ఉపయోగపడుతుంది. ప్రతి కణం లోపం పొటాషియం ఉంటుంది. పొటాషియం, సోడియం నిష్పత్తి సరిగ్గా ఉంటేనే ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. కండరాల కదలికలకు కూడా పొటాషియం కావాలి. పొటాషియం లేకపోతే వీక్ అయిపోతాం. నరాల నుంచి మెదడుకు సిగ్నల్స్‌ వెళ్లాలన్నా పొటాషియం కావాల్సిందే. ఎముక ధృడంగా ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూసుకుంటుంది.

అందుకే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే పొటాషియం, సోడియం తీసుకోవాలి. దానికోసం వండినవి, వేపేవి, పిండేవి కాకుండా నేచురల్‌గా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.