అల్లంతో 10 అద్భుత‌మైన ఆరోగ్య ప్రయజనాలు.. రోజు తీసుకుంటే ఆ సమస్యలన్నీ దూరం!

భారతీయుల వంటింట్లో అల్లం వాడకం తరాలుగా ఉంది. చిన్నారుల నుంచి బాలింతల వరకు చాలా రకాల సమస్యల నివారణకు పెద్దలు అల్లాన్నే వినియోగిస్తూ వుంటారు. అలాంటి అల్లంతో కలిగే ఉత్తమమైన ప్రయోజనాలు ఏంటో మీరు తెలుసుకోండి.

అల్లంతో 10 అద్భుత‌మైన ఆరోగ్య ప్రయజనాలు.. రోజు తీసుకుంటే ఆ సమస్యలన్నీ దూరం!


భారతీయుల వంటింట్లో అల్లం వాడకం తరాలుగా ఉంది. చిన్నారుల నుంచి బాలింతల వరకు చాలా రకాల సమస్యల నివారణకు పెద్దలు అల్లాన్నే వినియోగిస్తూ వుంటారు. అలాంటి అల్లంతో కలిగే ఉత్తమమైన ప్రయోజనాలు ఏంటో మీరు తెలుసుకోండి.

జీర్ణ స‌మ‌స్య‌లు ఎలాంటివైనా స‌రే.. అల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. కాస్తంత అల్లం ర‌సం తీసుకుంటే అజీర్ణం, గ్యాస్‌, క‌డుపులో మంట‌, క‌డుపు ఉబ్బ‌రం, అల్స‌ర్లు వంటి అనేక స‌మ‌స్య‌లు ఠక్కున మాయమైపోతాయి. అలాగే వికారం, వాంతులకు కూడా అల్లం చాలా బాగా పనిచేస్తుంది. 

దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు.. నోటి దుర్వాస‌న‌తో బాధ‌ప‌డుతున్న వారు.. అల్లంను ఎండ‌బెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు క‌లిపి పేస్ట్‌లా చేసి దంతాల‌ను తోముకోవాలి. దీంతో చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాస‌న చాలా వరకు త‌గ్గుతుంది.

సీజ‌న‌ల్ గా వచ్చే వ్యాధుల‌ను త‌గ్గించేందుకు కూడా అల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. కాస్త అల్లం ముక్క‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని పూట‌కు ఒక క‌ప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు సైతం త‌గ్గుతాయి.

అల్లంలో స‌హ‌జ‌ సిద్ధ‌మైన యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు అధికం. దాంతో నొప్పులు, వాపులు త్వరగా త‌గ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి అల్లం చాలా బాగా పని చేస్తుంది. రోజు అల్లం క‌షాయం తాగుతున్నా లేదా అల్లం ర‌సాన్ని ప‌ర‌గ‌డుపునే తీసుకుంటున్నా.. ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపే గుణం అల్లంలో ఉంది. అందుకే అల్లం ర‌సాన్ని రోజూ 2 టీ స్పూన్ల మోతాదులో ప‌ర‌గ‌డుపునే సేవిస్తుంటారు... దీంతో శ‌రీరంలోని వ్య‌ర్థాలు మొత్తం బ‌య‌ట‌కు పోయి శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. చాలా రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి.

అల్లం రక్తాన్ని పలుచన చేసి శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచే గుణాలు అధికం. అల్లంను రోజూ తీసుకుంటే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డి హైబీపీ త‌గ్గుతుంది. ఒంట్లో నొప్పులు తగ్గుతాయి.

అల్లంను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

మ‌హిళ‌లు నెల‌స‌రి స‌మ‌యంలో ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాలంటే.. అల్లం ర‌సాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే సేవించాలి. 

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో.. కొవ్వును కరిగించ‌డంలో అల్లం స‌హాయ‌ప‌డుతుంది. ప‌ర‌గ‌డుపునే అల్లం ర‌సం సేవిస్తుంటే.. మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాలరీలు స‌రిగ్గా ఖర్చ‌వుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇలా అల్లంతో మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

క్యాన్స‌ర్ రాకుండా చూసే గుణాలు అల్లంలో ఉన్నాయి. క‌నుక అల్లంను రోజూ తీసుకుంటే క్యాన్స‌ర్ ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.