Healthy Breakfast : ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తీసుకుంటే ఎన్ని లాభాలో..
రోజువారి జీవితంలో ఉదయం తీసుకుని breakfast ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. దీనిని బట్టే రోజంతా ఉత్సాహంగా ఉండటం ఉంటుంది.. అందుకే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి.

Breakfast : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహరం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలని చెబుతున్నారు నిపుణులు.. రోజు ఉదయాన్నే breakfast తప్పనిసరిగా తీసుకోవాలని ఎంతమంది చెప్తున్నా కొందరు పాటించరు.. ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల గ్యాస్టిక్ తో పాటు మరిన్ని అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి.. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉదయాన్నే ఏం తీసుకోవాలో ఒకసారి చూద్దాం..
రోజువారి జీవితంలో ఉదయం తీసుకుని అల్పాహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. దీనిని బట్టే రోజంతా ఉత్సాహంగా ఉండటం ఉంటుంది.. అందుకే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి అందులో ముఖ్యంగా శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం మెగ్నీషియంతో పాటు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరం రోజంతా చురుకుగా పని చేయడానికి సహాయపడతాయి.. అంతే కాకుండా ఎముకలు దృఢంగా ఉండటానికి.. నరాలు, కండరాలు, రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు కూడా ఇవి అవసరం..
తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి పంపించిన అన్ని పోషకాలు అందుతాయి రాగుల్లో అధిక శాతం ఐరన్ ఉంటుంది అందుకే ఉదయాన్నే రాగిజావ తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు బెల్లంతో కలిపిన రాగి జావా రక్తహీనతనం దూరం చేస్తుంది. అలాగే ఓట్స్ పాల తో కలిపి తీసుకున్న ప్రయోజనం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటే కూడా శరీరానికి మేలు చేస్తుంది. వాటిలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో అరటి పండ్లు కూడా తీసుకోవచ్చు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటంతో బీపీ సమస్యలు తగ్గుతాయి.
అలాగే పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే రోజూ ఊదయన్నే పాలకూర దోశ తినటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.. అలాగే ఇడ్లీతోపాటు కొబ్బరి చెట్నీ వంటివి తీసుకుంటూ ఒక గ్లాసు పాలు బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకుంటే రోజంతా అలసట దరిచేరదు. రోజుకో యాపిల్ని తింటే డాక్టర్ అవసరం ఉండదని చెబుతూ ఉంటారు ఈ ఆపిల్ ను అల్పాహారం లో భాగం చేసుకోవడం ఇంకా మంచిది.. అలాగే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్ ను తీసుకోవడం కూడా మంచిదే. ఉదయాన్నే గుడ్డు తీసుకోవటం మంచిది. నేరుగా గుడ్డు తినాలి అనిపించకపోతే హాఫ్ బాయిల్ చేసుకుని తిన్నా శరీరాన్ని కావలసిన పోషకాలు అందుతాయి..