Teenagers : టీనేజ్ పిల్లల్లో హార్మోన్లు సక్రమంగా ఉండటానికి తల్లులు ఇవ్వాల్సిన ఆహారం ఏంటంటే..

ఎదిగే వయసు పిల్లలకి పోషకాహారం అందించాలి. అందులో ముఖ్యంగా Teenagers కి మరింత అవసరం. ఈ సమయంలోనే ఆడపిల్ల రజస్వల అవ్వటం, మగ పిల్లలు యుక్త వయసుకు రావడం జరుగుతూ ఉంటుంది.

Teenagers  :  టీనేజ్ పిల్లల్లో హార్మోన్లు సక్రమంగా ఉండటానికి తల్లులు ఇవ్వాల్సిన ఆహారం ఏంటంటే..
Nutritional food for Teenagers


ఎదిగే వయసు పిల్లలకి పోషకాహారం అందించాలి. అందులో ముఖ్యంగా Teenagers కి మరింత అవసరం. ఈ సమయంలోనే ఆడపిల్ల రజస్వల అవ్వటం, మగ పిల్లలు యుక్త వయసుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆ వయసు పిల్లలకి తగిన ఆహారం అందించడం వల్ల హార్మోనులు సక్రమంగా స్థిరపడతాయని తెలుస్తోంది.

ఎదుగుతున్న పిల్లలకి అన్నంతో ఎలాంటి కూర వండించిన మొదటగా కొంచెం నెయ్యి, వాము, చిటికెడు ఉప్పు కలిపి మొదటి ముద్దను తినిపించాలి. ఇలా చేయటం వల్ల వారిలో జీర్ణశక్తి పెరిగి ఎంజైమ్స్ సక్రమంగా విడుదలవుతాయి.

రోజు కచ్చితంగా పాలు ఇవ్వాలి. వీలైతే రెండు పూటలు పాలను తాగించాలి. నెయ్యి ను అన్నంలో కలిపి తినిపించడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. రోజులో ఏదో ఒక పూట పెరుగును ఆహారంలో భాగం చేయాలి.

11 ఏళ్లు వచ్చినా ఆడపిల్లకి రోజు నువ్వులు బెల్లం కలిపిన వుండలు తినిపించాలి. ఇలా చేయడం వల్ల వారిలో రక్తహీనత దరిచేరదు. హార్మోన్లు సక్రమంగా పెరుగుతాయి. అలాగే ఈ వయసు పిల్లలకి ఎప్పటికప్పుడు మినప గారెలు ఇస్తూ ఉండాలి.

టీనేజ్ వయసుకు వచ్చినా మగ పిల్లలకి రోజు మినప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన మినప సున్నుండలు ఇవ్వాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే సమయంలో ఇలా చేయడం వల్ల వారిలో హార్మోనులు స్థిరపడతాయని తెలుస్తోంది.

బయట ఎక్కువగా దొరికే ఫాస్ట్ ఫుడ్, మసాలా పదార్థాలు, మాంసాహార పదార్థాలకు పిల్లల్ని దూరంగా ఉంచాలి. పిజ్జా బర్గర్లు వంటివి మైదాతో తయారవడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలను అధికం చేస్తాయి. అలాగే వీటి వల్లే శరీరంలో హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. ఈ కారణంగా పిల్లలు చిన్న వయసులో రజస్వల అవ్వటం లేదా నెలసరి సమయంలో ఇబ్బందులు ఎదురవటం వంటివి జరుగుతూ ఉంటున్నాయి.

ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో ఇస్తూ పోషకాహారాన్ని అందించడం వల్ల పిల్లలు సక్రమంగా ఎదుగుతారు. సహజంగా దొరికే పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు, చెరుకు రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి ఈ వయసు పిల్లల ఆహారంలో భాగం చేయాలి. మరి బరువు తక్కువగా ఉండి వయసుకు తగినట్టు కనిపించకపోతే జీడిపప్పును, డ్రై ఫ్రూట్స్ ను ఏదో ఒక పూట ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.