బిర్యానీలో వాడే ఈ పదార్థం..మగతనంపై ప్రభావం చూపిస్తుంది

బిర్యానీ ఈ మాట వినగానే చాలామందికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీలో ఉన్న వారికి బిర్యానీని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా వెంటనే ఫ్రెండ్స్ తో నా ఫ్యామిలీతోనే కలిసి ఏ రెస్టారెంట్ కు వెళ్లడం అక్కడ ఉండే బిర్యాని రోజులను ఆస్వాదించడం సాధారణ విషయం అయిపోయింది.

బిర్యానీలో వాడే ఈ పదార్థం..మగతనంపై ప్రభావం చూపిస్తుంది


బిర్యానీ ఈ మాట వినగానే చాలామందికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీలో ఉన్న వారికి బిర్యానీని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా వెంటనే ఫ్రెండ్స్ తో నా ఫ్యామిలీతోనే కలిసి ఏ రెస్టారెంట్ కు వెళ్లడం అక్కడ ఉండే బిర్యాని రోజులను ఆస్వాదించడం సాధారణ విషయం అయిపోయింది. అంతేకాకుండా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ విషయం మరింత తేలిక అయిపోయింది. నోటికి రుచిగా అనిపించిందని ఎప్పటికప్పుడు బిర్యాని లాగించేస్తున్న చాలామందికి దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అంతగా అవగాహన లేదు కానీ ఈ విషయాన్ని తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే.
How to make Hyderabadi Chicken Biryani Recipe - Blog
ఇక్కడ అసలు విషయం ఏంటంటే బిర్యానీ తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలుస్తోంది. ఈ విషయంపై ఎప్పటినుంచో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మగవారి నపుంసకత్వం మగతనం పై ఈ ప్రభావం ఉంటుందని చెప్పబోతున్నారు ఆరోగ్య నిపుణులు.
బిర్యానీతో పాటు ఉపయోగించే చికెన్ వల్ల శరీరంలో ఎన్నో క్యాలరీలు చేరుతాయని అలాగే బిర్యానీలో వాడే మాంసం, నూనె, మసాల దినుసులలోని ఫ్యాట్ నుంచి వస్తాయి. కానీ రెస్టారెంట్లలో, మాంసం తక్కువగా, మసాలాలు, బియ్యం ఎక్కువగా వేస్తారు. రుచి కోసం బిర్యానీని బయట తింటే ఎక్కువ కేలరీలు, తక్కువ ప్రొటీన్లు అందుతాయి. చికెన్‌తో పోలిస్తే, మటన్‌లో ఎక్కువ కొవ్వు, తక్కువ ప్రొటీన్ ఉంటుంది. ఎక్కువ మాంసం కలిపితే ప్రొటీన్లు ఎక్కువ వస్తాయి. కానీ హోటల్ బిర్యానీల్లో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా లభిస్తాయి.. అని తెలుస్తోంది.
ప్రస్తుత ఆహారపు అలవాట్లలో సమతుల ఆహారం, కూరగాయలు, పండ్లు తక్కువగా ఉండటం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల స్థూలకాయం పెరిగిపోతుంది. ఊబకాయంతో వీర్యకణాలు తగ్గుతాయి. అయితే వీర్యకణాలలో తగ్గుదల కేవలం బిర్యానీ వల్లనే రాదు. కాకపోతే ఎక్కువగా బిర్యానీ తినేవారు జాగ్రత్తగా ఉండాలి. 
ముఖ్యంగా బయట రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఉపయోగించి బిర్యానీలు తయారు చేయడం వల్ల వీటి ప్రభావం ఉంటుంది అలాగే బిర్యానీలో వాడే టేస్టింగ్ సాల్ట్ మరికొన్ని రసాయనక పదార్థాలు పురుషుల వీర్యకణాల పైన ప్రభావం చూపిస్తాయి అన్నమాట నిజమే అయితే ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు కానీ తరచు బిర్యానీ తీసుకోవడం వల్ల మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.