కాకర కాయ ప్రయోజనాలను ఆయుర్వేదం వర్ణించిన తీరు తెలిస్తే నిజంగా నోరేళ్ల పెట్టాల్సిందే..!

కాకరకాయను చూస్తేనే చాలా మంది ఆమడ దూరం వెళతారు. ఇంట్లో కాకరకాయ కూర చేశారంటే చాలు గొడవ చేస్తుంటారు. చాలా చేదుగా ఉంటుంది అనేది ప్రధాన కారణం.. కానీ ఇందులోని ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా కాకరను ఆహారంలో భాగంగా మార్చుకుంటారు. మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుందనే సామెతకు

కాకర కాయ ప్రయోజనాలను ఆయుర్వేదం వర్ణించిన తీరు తెలిస్తే నిజంగా నోరేళ్ల పెట్టాల్సిందే..!


కాకరకాయను చూస్తేనే చాలా మంది ఆమడ దూరం వెళతారు. ఇంట్లో కాకరకాయ కూర చేశారంటే చాలు గొడవ చేస్తుంటారు. చాలా చేదుగా ఉంటుంది అనేది ప్రధాన కారణం.. కానీ ఇందులోని ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా కాకరను ఆహారంలో భాగంగా మార్చుకుంటారు. మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుందనే సామెతకు ఉదాహరణ ఈ కాకరే అని కూడా అంగీకరించక మానరు. అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటంనిటే... 

Kakara Kaya Vepudu - Bitter Gourd Stir fry - Indian food recipes - Food and  cooking blog

కాకరలో 26 శాతం బీ విటమిన్లు, 5 శాతం కే విటమిన్లు ఉండగా... 3 శాతం ఇనుము, 8 శాతం జింక్ ఉంటుంది. చేదుగా ఉండే ఈ కాకర ఆకుల్ని గాయాల మీద నలిపి గట్టిగా నొక్కి పెడితే రక్తస్రావం ఆగుతుంది. ఇవి మాత్రమే కాదు.. ఆకుపచ్చ, తెల్లని కాకర రకాల్లో ఆయుర్వేదంలో తెలుపు రంగు వాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. సాధారంగా.. కాకరను... కంటి, వాతపు వ్యాధులు, మూత్ర వ్యాధుల చికిత్సలో ఎక్కువగా తీసుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు... దగ్గు, జలుబు, తుమ్ములు, ఉబ్బసం, ఆయాసం, దురదలు వంటి ఎలర్జీ వ్యాధుల నివారణలో కాకర కాయ మంచి ప్రభావం చూపిస్తుంటుంది. అయితే కాకరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి... ఈ కాకరకాయతో చేసే వంటల్లో చింతపండు రసం, కొరివి కారం వంటి వాటిని కలిపి నూనెలో వేసి వేయించటం వంటి పనులు చేయకూడదు. మజ్జిగలో వేసి వార్చి అప్పుడు కూర చేసుకోవడం మంచిది. అలాగే... మంచి నూనె కంటే నేతితో కాకరకాయ కూర వండితే మంచి ఫలితాలు వస్తాయి. జీర్ణకోశ వ్యాధులు, అమీబియాసిస్ వ్యాధితో బాధపడే వారికి కాకర మేలు చేస్తుంది.

చింతపండు రసం పోయటం కన్నా, దోసకాయ, నిమ్మకాయ, టొమేటాలతో ఉసిరికాయ తొక్కుడు పచ్చడి (నల్లపచ్చడి)తో గాని కలిపి కాకర కూరను తయారుచేసుకొంటే ఎవ్వరికీ ఎలాంటి హానీ ఉండదు. జీర్ణకోశ వ్యాధులు, అమీబియాసిస్ వ్యాధితో బాధపడేవారికి, కాకర మేలు చేస్తుంది. దాన్ని కారం, పులుపు, నూనెలతో కల్తీ చేయకుండా వండుకుంటేనే మేలు చేస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.