Immunity power : రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలివే.. !

కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలో immunity power ని పెంచడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఏ కాలంలో నైనా దొరికే అన్ని రకాల పండ్లను కాయగూరలను తీసుకోవడం వల్ల శరీరాన్ని కావాల్సిన పోషకాలు అందుతాయని తెలుస్తోంది..

Immunity power : రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలివే.. !
Foods that increase immunity


కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలో immunity power ని పెంచడంలో తోడ్పడతాయి. అలాగే మారిపోతున్న జీవనశైలతో బయట పరిస్థితిలతో ప్రతి ఒక్కరూ శక్తిని పెంచుకోవడ విషయం పైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి వ్యాధులైన తట్టుకుంటుందని తెలుస్తోంది అవి ఏంటంటే..

ముఖ్యంగా ఏ కాలంలో నైనా దొరికే అన్ని రకాల పండ్లను కాయగూరలను తీసుకోవడం వల్ల శరీరాన్ని కావాల్సిన పోషకాలు అందుతాయని తెలుస్తోంది.. అందుకే దాదాపు అన్ని రకాల పండ్లను తీసుకోవడం మంచిది..

అలాగే మాంసం, గుడ్లు, చేపల్లో ప్రోటీన్స్ అధిక స్థాయిలో ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. అందుకే మాంసాహారులు తరచూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి..

సిట్రస్ జాతి పళ్ళల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి.. అందుకే నిమ్మ దానిమ్మ ఆరంజ్ వంటి పనులను తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి..

అలాగే అన్ని రకాల ఆకు కూరలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.. ఆకుకూరల్లో తోటకూర గోంగూర పాలకూర మునగాకు వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరాన్ని కావలసిన పోషకాలు అందుతాయి. నేరుగా తినకపోతే ఏవైనా పప్పులతో కలిపి తీసుకోవచ్చు.. 

అలాగే విటమిన్ ఎ ఎక్కువగా వుండే క్యారెట్, బీట్రూట్ కీరదోసవంటి వాటిని తినాలి.. కీరదోస ఆకలిని పెంచి తోడ్పడుతుంది.. 

ఐరన్ ఎక్కువగా ఉండే బీన్స్, లివర్, పాలకూర వంటివి తీసుకోవాలి.. ఐరన్ శరీరాన్ని బలపరుస్తుంది..

అలాగే ప్రోటీన్స్ అధిక స్థాయిలో ఉండే పప్పు దినుసులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి..

అలాగే పసుపు కలిపిన పాలను, అల్లం, వెల్లుల్లి వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి..

బాదం, అంజీర, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ను తరచూ తీసుకోవాలి..

పాలు, పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడిందని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.