ఉసిరి, మునగ ఆకుల జ్యూస్‌.. తాగారంటే ఇమ్యునిటీ పవర్‌ పెరగాల్సిందే..! 

ఉసిరి గురించి ఎంత చెప్పినా తక్కువే.. దీంతో కేవలం పచ్చళ్లు చేసుకుని తినేవారు ఉన్నారు.. కానీ మీరు డైలీ ఉసిరి కాయలనో లేదా ఉసిరిరసాన్నో తాగారంటే.. అద్భుతాలు జరుగుతాయి.. తల నుంచి అరికాలు వరకూ మొత్తం

ఉసిరి, మునగ ఆకుల జ్యూస్‌.. తాగారంటే ఇమ్యునిటీ పవర్‌ పెరగాల్సిందే..! 


ఉసిరి గురించి ఎంత చెప్పినా తక్కువే.. దీంతో కేవలం పచ్చళ్లు చేసుకుని తినేవారు ఉన్నారు.. కానీ మీరు డైలీ ఉసిరి కాయలనో లేదా ఉసిరిరసాన్నో తాగారంటే.. అద్భుతాలు జరుగుతాయి.. తల నుంచి అరికాలు వరకూ మొత్తం మీ శరీరానికి కావాల్సిన పోషకాలను ఉసిరి అందించగలదు. రోగనిరోధక శక్తిని పెంచడంలో దీన్ని మించింది లేదు.! ఉసిరికాయలకు, మునగ ఆకులు జోడించి కషాయం చేసుకుని తాగితే.. ఇమ్యునిటీ పవర్‌ అమాంతం పెరుగుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలంటే విట‌మిన్ సీ ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాల‌ను తీసుకోవాలని మీకు తెలిసిన విషయమే.. నారింజ‌లు, పైనాపిల్‌, బ‌త్తాయి పండ్ల‌లో విట‌మిన్ సీ అధికంగా ఉంటుంది. 

ఉసిరికాయ‌లు, మున‌గ ఆకుల‌తో క‌షాయం ఎలా చేయాలంటే..

ఉసిరికాయ‌ల‌నే ఆమ్లా అని పిలుస్తారు. దీన్ని ఇండియ‌న్ గూస్‌బెర్రీ అని కూడా అంటారు. దీంట్లో విట‌మిన్ పుష్కలంగా ఉంటుంది.. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఉసిరికాయ పొడి మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. దాన్ని తీసుకున్నా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఇక మున‌గ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకునేలా చేస్తాయి. దీంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. మున‌గ ఆకులు ల‌భించ‌క‌పోతే వాటికి బ‌దులుగా కొత్తిమీర అయినా వాడుకోవచ్చు..

కావ‌ల్సిన ప‌దార్థాలు

మున‌గ ఆకుల పొడి – అర టీస్పూన్ లేదా 5 నుంచి 10 మున‌గ ఆకులు
ఉసిరికాయ – 1 లేదా ఒక టీస్పూన్ ఉసిరికాయ పొడి
నీళ్లు – అర గ్లాస్

త‌యారు చేసే విధానం

బ్లెండ‌ర్‌లో అన్ని ప‌దార్థాల‌ను వేసి మిశ్ర‌మంగా ప‌ట్టుకోవాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టండి ...దాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని డైలీ తాగడం వల్ల.. షుగర్‌, బీపీ అదుపులో ఉంటాయి.. జుట్టు సమస్యలు ఏం ఉన్నా.. తగ్గుతాయి. అందానికి కూడా ఈ జ్యూస్‌ బాగా పనిచేస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.