బాబోయ్ ఎండలని భయపడుతున్నారా.. ఈ జూస్లు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందం మీ చెంతే!

బయటకు వస్తే చాలు ఎండలు మండిపోతున్నాయి. అప్పుడే ఎండాకాలంలో వేసుకోవాల్సిన బట్టలు సైతం తీసి పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి.

బాబోయ్ ఎండలని భయపడుతున్నారా.. ఈ జూస్లు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందం మీ చెంతే!


బయటకు వస్తే చాలు ఎండలు మండిపోతున్నాయి. అప్పుడే ఎండాకాలంలో వేసుకోవాల్సిన బట్టలు సైతం తీసి పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆరోగ్యాన్ని ఎలా పదిలంగా కాపాడుకోవాలి అని ఆలోచనలు కూడా చేసేస్తున్నారు. మరి ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఎండాకాలం వస్తుందంటే కచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరి. కొందరికి ఎండ ప్రభావం అస్సలు పడదు. ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. శరీరం తీవ్రంగా అలసిపోవడం, ఎండ వల్ల చర్మంపై రాషెస్ రావడం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ముందు శరీరం డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అయితే మండు వేసవిలో కూడా శరీరాన్ని నిండుగా ఎలా ఉంచాలంటే

ఎండాకాలంలో కచ్చితంగా తగినంత నీటిని తీసుకోవాలి. అలాగే శరీరానికి మేలు చేసే రసాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ కాలంలో మామిడిపళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని రసంగా మార్చుకుని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరం కోల్పోయిన ప్రోటీన్లు, విటమిన్లు తిరిగి శరీరానికి అందుతాయి. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎండాకాలంలో పెరుగును తీసుకోవడం తగ్గించి మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలి. రోజు ఖచ్చితంగా రెండు పూటలా మజ్జిగను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే బయట ఎక్కడపడితే అక్కడ దొరికే శీతల పానీయాలు తీసుకోకుండా ఎక్కడికి వెళ్లినా చిక్కని మజ్జిగను తోడుగా ఉంచుకోవడం మంచిది.

అలాగే నిమ్మ రసాన్ని కలిపిన నీరు తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల శరీరం డిహైడ్రేట్ అవ్వదు. నిమ్మరసం తక్షణ శక్తిని అందిస్తాయి.

అలాగే ఎండాకాలంలో మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. దీని వలన శరీరం నుండి విపరీతంగా చెమట వాసన వచ్చే అవకాశం ఉంది. అధికంగా మసాలాలు బయట దొరికే చిరుతిళ్ళు వేపుళ్ళు కూడా తీసుకోవడం మానేయాలి.

రోజు బార్లీ నీళ్లు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

ఈ కాలంలో ఎక్కువగా దొరికే పండ్లు పుచ్చకాయలు. వీటిలో పోషకాలతో పాటు నీరు కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటి జ్యూస్ ను తీసుకుంటం వల్ల బాడీ డిహైడ్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా శరీరం నిగారింపును సంతరించుకుంటుంది. మొహంలో కోల్పోయిన జీవకళ తిరిగి వస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.