గురక వేధిస్తుందా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా దూరం చేసుకోలేకపోతే ఈ చిట్కాలు ఒకసారి పాటించండి!

ప్రస్తుతం అన్ని వయసుల వారికి గురక ఓ సమస్యగా మారింది. ఈ గురకపెట్టే వారి వల్ల పక్కనుండే వారు రాత్రివేళ విపరీతంగా బాధపడుతుంటారు. దాంతో .. దంపతుల మధ్య కలహాలు..

గురక వేధిస్తుందా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా దూరం చేసుకోలేకపోతే ఈ చిట్కాలు ఒకసారి పాటించండి!


ప్రస్తుతం అన్ని వయసుల వారికి గురక ఓ సమస్యగా మారింది. ఈ గురకపెట్టే వారి వల్ల పక్కనుండే వారు రాత్రివేళ విపరీతంగా బాధపడుతుంటారు. దాంతో .. దంపతుల మధ్య కలహాలు... రాత్రి ప్రశాంతత వుండటం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే... పెద్దవారిలో దాదాపు 45 శాతం మందికి గురక సమస్య వున్నట్టు చెబుతున్నారు. ఈ గురక సమస్యని అధిగమించడానికి ఈ సూచనల్ని పాటించమంటున్నారు వైద్యులు.

1 . నిద్రించే గదిలో పొడి గాలి ఉండటం వల్ల చాలా మందిలో గురక సమస్య తలెత్తుతుంది. నాసికా రంధ్రాలు, గొంతు పొడిగా మారడం వల్ల గాలి కదలికకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది గురకకు దారి తీస్తుంది. కాబట్టి తేమను అందించే హ్యుమిడిఫైయర్ను గదిలో ఉంచుకోవడం వల్ల గురక సమస్యను కొంత వరకు తగ్గించుకోవచ్చు.

2 . మన శరీర శ్వాస వ్యవస్థను ప్రాణాయామం మెరుగుపరుస్తుంది. ప్రాణాయామం వల్ల శ్వాసక్రియపై పట్టు పెరుగుతుంది. ఈ యోగా ప్రక్రియ వల్ల ఊపితిత్తులకు సరిపడా ఆక్సిజన్ అందుతుంది. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల గురక మాత్రమే కాకుండా నిద్రకు సంబంధించిన అనేక రుగ్మతలు దూరం అవుతాయి. శరీరానికి నూతన శక్తి లభిస్తుంది.

3 . గొంతు, నాలుకలోని కండరాలను బలోపేతం చేయడం ద్వారా గురకను అడ్డుకోవచ్చు. గొంతు, నాలుకకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం ద్వారా అవి బలపడతాయి. విశ్రాంతి సమయంలో శ్వాసకు అడ్డు రాకుండా ఉంటాయి.

4 . అధిక బరువు ఉండటం కూడా గురకకు ప్రధాన కారణం. ఊబకాయుల్లో గొంతులోని అధిక కణాల కారణంగా నిద్రించేటప్పుడు శబ్దం వస్తుంది. శ్వాసక్రియకు ఇబ్బందులు తలెత్తడం వల్ల గురక మొదలవుతుంది.

5 . గురక పెట్టడానికి పొగ తాగే అలవాటు కూడా కారణం అవుతుంది. కాబట్టి అనారోగ్యకరమైన ఈ అలవాటుకు దూరంగా ఉంటేనే మంచిది. నిద్రించే ముందు ఆల్కహాల్ తీసుకోవడం మానేయటం వల్ల గురక సమస్య నుంచి బైట పడవచ్చు.

6 . నిద్రించే సమయంలో తలగడ ఉంచుకోవడం వల్ల కూడా గురక సమస్య కొంత వరకు తగ్గుతుంది. ఐతే దిండు మరీ ఎత్తుగా లేదా మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి.

7 . రాత్రిపూట నిద్రకు ముందు గ్లాసు పాలలో రెండు చెంచాల పసుపు కలుపుకొని తాగడం వల్ల గురక సమస్య దూరం అవుతుంది.

8 . గోరు వెచ్చగా చేసిన వడగట్టిన నెయ్యిని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల చొప్పున వేయడం వల్ల గురక తగ్గడంతోపాటు నిద్ర బాగా పడుతుంది.

9 . నెయ్యి బదులు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే బ్రాహ్మి తైలం కూడా వాడొచ్చు. రోజులో ఉదయం ఒకసారి, నిద్రకు ఉపక్రమించే ముందు ఒకసారి చొప్పున రోజులో రెండుసార్లు ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

10 . రాత్రి నిద్రించే ముందు గ్లాసు వేడి నీటిలో అర టేబుల్ స్పూన్ యాలకుల గింజల పొడిని కలుపుకొని తాగడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది. గురకను నివారించడానికి ఇది చక్కటి మందు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.