ప్రోటీన్ పౌడర్ ఉపయోగిస్తున్నారా.. శరీరానికి జరిగే ఈ 5 నష్టాలు తెలుసుకోకపోతే ప్రాణాపాయం తప్పదు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామందికి ఆరోగ్య స్వృహ పెరుగుతూ వస్తుంది. అయితే ఇందులో మంచి తో పాటు చెడు సైతం కనిపిస్తూ ఉండటం చెప్పుకోదగిన విషయం. ఈరోజుల్లో చాలామంది యువత నుంచి పెద్దవారి వరకు ప్రోటీన్ పౌడర్ను ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నారు.

ప్రోటీన్ పౌడర్ ఉపయోగిస్తున్నారా.. శరీరానికి జరిగే ఈ 5 నష్టాలు తెలుసుకోకపోతే ప్రాణాపాయం తప్పదు!


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామందికి ఆరోగ్య స్వృహ పెరుగుతూ వస్తుంది. అయితే ఇందులో మంచి తో పాటు చెడు సైతం కనిపిస్తూ ఉండటం చెప్పుకోదగిన విషయం. ఈరోజుల్లో చాలామంది యువత నుంచి పెద్దవారి వరకు ప్రోటీన్ పౌడర్ను ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే అవసరానికి మించి ఈ పౌడర్ ను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఈ పౌడర్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐదు ప్రధాన సమస్యలు తలెత్తుతాయని సమాచారం. 

The hidden dangers of protein powders - Harvard Health

సాధారణంగా జిమ్ కు ఎక్కువగా వెళ్లే యువత ఈ ప్రోటీన్ పౌడర్ ను తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ప్రోటీన్ పౌడర్ ద్రవ పదార్థంలో గ్లోబులర్ ప్రోటీన్‌ ఉంటుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ను ఈ పౌడర్ అందిస్తుందని దీన్ని ఆశ్రయిస్తూ వస్తున్నారు. కాగా ప్రోటీన్ పౌడర్ ద్రవ పదార్థంలో గ్లోబులర్ ప్రోటీన్‌ ఉంటుంది. ఈ ద్రవ పదార్థం జున్ను ఉత్పత్తుల బయోప్రొడక్ట్ నుండి తీసుకోబడింది. ఈ గ్లోబులర్లు శరీరానికి మేలు చేసే దానికంటే ఎక్కువ హాని చేస్తాయి.

ముఖ్యంగా ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల కలిగే ఐదు ఆరోగ్య నష్టాలు ఏంటంటే.. 

పోషకాల బ్యాలెన్స్..

ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. గుడ్లు, పాలు, మాంసం వంటి సహజ ప్రోటీన్లను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టం ఉండదు కానీ ఈ ప్రోటీన్ పౌడర్ కేవలం ప్రోటీన్ మాత్రమే అందించడం వల్ల శరీరంలో పోషకాలు ఇన్ బ్యాలెన్స్ అవుతాయని తెలుస్తోంది. 

మొటిమలు, మచ్చలకు కారణం.. 

హార్మోన్లు, బయోయాక్టివ్ పెప్టైడ్‌లను కలిగి ఉండే ప్రోటీన్ లాంటి పౌడర్‌లు. ఇవి సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మొటిమల సమస్య పెరుగుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

గ్యాస్, అజీర్తి సమస్యలకు కారణం..

ఈ ప్రోటీన్ పౌడర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పికి దారితీస్తుంది. గ్యాస్, అజీర్ణం సమస్యలను కలిగిస్తుంది.

టాక్సిక్ పౌడర్.. 

బాడీబిల్డర్లు మంచి కంపెనీల నుండి ప్రొటీన్ పౌడర్ తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు కొన్ని రకాల కంపెనీలు ప్రోటీన్ పౌడర్లు నాసిరకం ఉత్పత్తులను ఉపయోగించటం వల్ల ఇవి శరీరానికి హాని కలిగించే మారుతున్నాయి వీటిని వల్ల తలనొప్పి, అలసట, మలబద్ధకం, కండరాల నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది

కొన్నిసార్లు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ప్రతికూలతలు ఉంటాయి. దాని వల్ల ఇన్సులిన్ స్థాయిలో మార్పు రావడం అందులో ఒకటి. వ్యాయామం తర్వాత ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది.. 

అందుకే వ్యాయామం చేసేవారు జిమ్ కి వెళ్లేవారు సరైన పోషకాహారం తీసుకుంటూ ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇలా కాకుండా ప్రత్యామ్నాయంగా ఇలాంటి ప్రోటీన్ పౌడర్లు ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.