ఇలా చేస్తే మండిపోతున్న ఎండల్లో సైతం ఇల్లు కూల్ కూల్ గా ఐపోతుంది..!

ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దటేస్తున్నాయి. ఇళ్లు దాటి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. అయినా  ఇళ్లు కూడా నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. కూలర్లు, ఏసీలు లేకుండా  ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కానీ వీటి ధర ఎండలు గా తీవ్రంగా ఉన్నాయి. అందుకే ఖరీదైన ఏసీలు, వసతులు ఏర్పాటు చేసుకోలేని వారు

ఇలా చేస్తే మండిపోతున్న ఎండల్లో సైతం ఇల్లు కూల్ కూల్ గా ఐపోతుంది..!


ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దటేస్తున్నాయి. ఇళ్లు దాటి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. అయినా  ఇళ్లు కూడా నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. కూలర్లు, ఏసీలు లేకుండా  ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కానీ వీటి ధర ఎండలు గా తీవ్రంగా ఉన్నాయి. అందుకే ఖరీదైన ఏసీలు, వసతులు ఏర్పాటు చేసుకోలేని వారు.. కొన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటే దీర్ఘకాలం పాటు ఇల్లు  చల్లగా ఉంటుంది. అదెలా అంటే?

వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే వెదురు, మట్టి, గడ్డి లాంటి వాటితో ఇంటిని చల్లగా ఉంచుకోవడం ఒక మార్గమైతే… మరి కొందరు ఆధునికి పద్ధతుల్లో ఇన్సులేటెడ్ గోడలు, ప్యానెళ్లతో ఇంటిని చల్లబరుచుకుంటున్నారు. అయితే అటు సులభంగా ఇటు ఆధునికంగా ఉండే మరికొన్ని మార్గాలున్నాయి... 
వాల్ క్లాడింగ్స్.. ఇది గోడకు బయటి వైపు పెట్టే ఒక టెక్స్చర్. వాతావరణానికి, ఇంటి గోడలకు మధ్య అడ్డుగా ఉంటుంది. దీనివల్ల గది లోపల టెంపరేచర్ కంట్రోల్ లో  ఉంటుంది. ఇవి గోడలను ఎండనుంచి ఎక్కువసేపు రక్షిస్తుంది. మార్కెట్ లో అనేక రంగుల్లో ఉంటాయి.
రేడియంట్ కూలింగ్.. ఏసీలకు బదులుగా రేడియంట్ కూలింగ్ సిస్టం కూడా మంచి మార్గం. కానీ దీన్ని ఇల్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడే చేయించాలి. దీనివల్ల ఇల్లంతా చల్లగా ఉంటుంది.  ఏసీ ల కన్నా దీని నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. పర్యావరణ హితం కూడా.
టెంపరేచర్ షీల్డ్ టైల్స్.. వాల్ క్లాడింగ్స్ లాగే, టెంపరేచర్ షీల్డ్ టైల్స్ కూడా మంచి ప్రయత్నమే. వీటిని పైకప్పులు, బాల్కనీ, ఇంటి బయట గోడలకు వినియోగిస్తారు. ఇవి వేడిని గ్రహించవు. దీనివల్ల గదిలోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇవి ఎక్కువ రోజులు మన్నుతాయి. వీటిని చాలా సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. 
ఎండలో వీటిని ఉపయోగించడం వల్ల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఏసీ ఫ్యాన్ వంటి వాటి వాడకం తగ్గుతుంది చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఏ వయసు వారికైనా ఆహ్లాదాన్ని అందిస్తాయి. అంతేకాకుండా కరెంట్ బిల్లును తేలిగ్గా ఆదా చేయొచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.