మాంసం, ఫాస్ట్ ఫుడ్ తో విదేశీయులకు రాని అనారోగ్యాలు మనకే ఎందుకంటే.. !

పాశ్చాత్య దేశాల నుండి భారతీయులు ఆహార‌పు అల‌వాట్ల‌ను తెచ్చుకున్నారు కానీ వేరేదేశీయులకు రాని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మ‌న‌కు మాత్రమే ఎందుకు వస్తున్నాయి అని జరిపిన అధ్యయనాల్లో ఏమని తేలింది అంటే.. 

మాంసం, ఫాస్ట్ ఫుడ్ తో విదేశీయులకు రాని అనారోగ్యాలు మనకే ఎందుకంటే.. !


విదేశీయులు అధిక మొత్తంలో మాంసాన్ని తీసుకుంటూ ఉంటారు అలాగే అన్ని రకాల మాంసాహారాన్ని ఆహారంలో భాగం చేసుకుంటారు అంతేకాకుండా విపరీతంగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటారు వీరిని చూసి పాశ్చాత్య దేశాల నుండి భారతీయులు ఆహార‌పు అల‌వాట్ల‌ను తెచ్చుకున్నారు కానీ వేరేదేశీయులకు రాని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మ‌న‌కు మాత్రమే ఎందుకు వస్తున్నాయి అని జరిపిన అధ్యయనాల్లో ఏమని తేలింది అంటే.. 

విదేశాల్లో పాటించే ఆరోగ్య నాణ్యత ప్రమాణాలు చాలా ఎక్కువ ఇక్కడ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠిన నిర్ణయాలను అమలు చేస్తుంది కానీ భారతదేశంలో మాత్రం ఇలాంటి నియమాలు ఏమీ లేవు ఒక రోజున తరబడి నిల్వ ఉంచిన మాంసాహారాన్ని రెస్టారెంట్లలో వాడుతూ ఉంటారు అలాగే ఎన్నోసార్లు వాడేసిన నూనె ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఉపయోగిస్తూ ఉంటారు ఇలాంటి వాటి వలన అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి.. 

విదేశీయులు అధిక మొత్తంలో పిజ్జా బర్గర్ నూడిల్స్ చికెన్ వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు కానీ అదే ఆహారాన్ని మన భారతీయుల తీసుకుంటే పేగు సంబంధిత సమస్యలతో పాటు మరిన్ని సమస్యలు చుట్టుముడతాయి.. దీనికి ప్రధాన కారణం ఆహార నాణ్యత లోపం విదేశాల్లో కచ్చితంగా నియమాలను పాటిస్తూ అక్కడ అధికారులు సూచించిన విధంగానే ఆహార నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఉంటారు.. ప్రజలకు హాని చేసే ఎలాంటి పదార్థాలనైనా వీరు నిర్మొహ‌మాటంగా బ్యాన్ చేస్తారు. అంతేకాకుండా ఆహారంలో ఉండే పోషకాలు పోకుండా వండి పెడతారు అలాగే తిన్న దానికి అనుగుణంగా వ్యాయామాలు కూడా చేస్తారు. ఈ నియమాలు ఏవి కూడా భారత్లో ఉండవు.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కడకక్కడ కొత్తగా పుట్టుకొస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లు సైతం ఈ విషయంలో జాగ్రత్త వహిస్తారు. కానీ ఇలాంటి జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం భారతీయులు మరిన్ని అనారోగ్య సమస్యలకు గురికావడానికి కారణాలు అవుతున్నాయి.

అందుకే వీటన్నిటిని గుర్తుపెట్టుకుని ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. బయట ఆహార పదార్థాలను తినడం తగ్గించుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ ను, నోటికి రుచిగా అనిపించే మసాలా పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే పాశాత్య సంస్కృతిని మన భారతీయ సంస్కృతిలో కలిపి మన అలవాట్లను మార్చుకోకూడదు. అక్కడ ఉండే ఆహార పద్ధతులు, నియమాలు, వాతావరణ పరిస్థితులు వేరు అనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే చాలా దేశాల్లో మద్యపానాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అయితే అక్కడ ఉండే చల్లని వాతావరణానికి మద్యం తీసుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విదేశీయులు విచ్చలవిడిగా తాగటం వల్ల రాని రోగాలు భారతీయులకే ఎందుకు వస్తాయి అనుకుంటూ లేనిపోని అలవాట్లను నిత్య జీవితంలో భాగం చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.