Salmon Fish : గుండె జబ్బులు, థైరాయిడ్ నుంచి కాపాడే సాల్మన్ ఫిష్.. తరచూ తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో!

సముద్రంలో దొరికే salmon fish లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.. ఇవి ఎన్నో రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలని అందిస్తాయి. తరచూ వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Salmon Fish : గుండె జబ్బులు, థైరాయిడ్ నుంచి కాపాడే సాల్మన్ ఫిష్.. తరచూ తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో!
benefits of eating salmon fish


సముద్రంలో దొరికే salmon fish లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.. ఇవి ఎన్నో రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలని అందిస్తాయి. తరచూ వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

మాంసాహారంలో సీ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా చేపల్లో సాల్మన్ ఫిష్ తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. చేపల్లో ఉండే కొవ్వు లో మంచి పోషకాలు ఉంటాయి. సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉండే చేపలు.

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సాల్మన్ ఫిషను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే అధిక ప్రోటీన్స్ శరీరానికి తగిలిన గాయాలని త్వరగా మాన్పటంలో సహాయపడతాయి. ఎముకల్లో బలాన్ని పెంచుతాయి.

బరువు తగ్గాలి అనుకునే వారి సైతం సాల్మన్ ఫిష్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ బి 12, నియసిన్, విటమిన్ బి6, రిబోఫ్లేవిన్, పంతోతేనిక్ ఆమ్లం, థియమిన్, ఫాలిక్ యాసిడ్స్ ఉంటాయి.

ఈ చేపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ కారణంగా రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా గుండె జబ్బులు సైతం రాకుండా ఉంటుంది.

ఈ చేపల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ సమస్య ఉన్నవారికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ హార్మోన్లను అదుపులో ఉంచడమే కాకుండా దీని వల్ల వచ్చే దుష్ప్రభావాలను సైతం తగ్గిస్తుంది.

అలాగే అథెరోస్క్లెరోసిస్ అనేది గుండెకు వచ్చే ఒక సమస్య. దీని వల్ల ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. సాల్మన్లోని ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ ఫలకాల వల్ల కలిగే మంటని తగ్గించి ఇవి ఏర్పడకుండా ఉండేందుకు సహాయపడతాయి.

గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మాత్రమే కాకుండా కీళ్ల సంబంధిత సమస్యలు ఉన్నవారికి కూడా సాల్మన్ ఫిష్ మేలు చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి మంచి ప్రయోజనకరం.

కాగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే కేవలం చేపల్లో మాత్రమే ఉండవు. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో కూడా ఈ ఫ్యాటీ ఆసిడ్ దొరుకుతాయి. అవి వాల్నట్స్, సోయాబీన్, అవిసె గింజలు, కిడ్నీ బీన్స్, ఆలివ్ ఆయిల్ లో ఈ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. అందుకే వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరాన్ని కాపాడుకోవచ్చు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.