డిన్నర్‌లో ఏం తినాలి, తినకూడదో ఓ లుక్కేద్దాం.

నైట్ డిన్నర్‌లో మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ నిద్ర ప్రభావితం అవుతుంది. ఇది కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒక కారణం. 

డిన్నర్‌లో ఏం తినాలి, తినకూడదో ఓ లుక్కేద్దాం.


నైట్ డిన్నర్‌లో మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ నిద్ర ప్రభావితం అవుతుంది. ఇది కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒక కారణం. 
Early dinner: Why an earlier evening meal is the healthier option

రాత్రి వేళ తినాల్సినవి :

నైట్ టైమ్‌లో పేదవాడిలా భోజనం చేయాలనే నానుడి ఉంది. అంటే  దీని ఉద్దేశ్యం రాత్రి సమయంలో చాలా తక్కువ తినాలని అర్థం. అదే సమయంలో సరైన ఆహారాలు తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. చక్కెర, ఉప్పగా ఉండే ఆహారాలు రాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తాయి. విటమిన్ B6, ట్రిఫ్టోఫాన్, లీన్ ప్రోటీన్, కాంప్లెక్స్ కార్పొహైడ్రేట్లతో నిండిన తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి

ఆకు కూరలు :

శరీరం మెలటోనిన్‌ను తయారు చేయడానికి కాల్షియం అవసరం అవుతుంది మెలటోనిన్ అనేది రాత్రిపూట సహజంగా నిద్రపోవడానికి మీకు సహాయపడే ఒక హార్మోన్. ఇది పాలు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరల్లో లభ్యమవుతుంది. రాత్రి భోజనంలో ఇవి తీసుకోవాలి

ఓట్స్ భోజనం :

ఓట్స్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల మీకు అర్ధరాత్రి ఆకలి అనిపించదు. ఓట్‌మీల్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లు, ప్రొటీన్‌లు సెరోటోనిన్‌ను విడుదల చేయడం వల్ల రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

సీ ఫుడ్ :

వారానికి ఒకసారి చేపలు లేదా సీఫుడ్ తినడం మంచి పద్ధతి. ఎందుకంటే విటమిన్ B6 శరీరం మెలటోనిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడే మరొక పోషకం.

Almonds :

బాదంపప్పు నిద్రను మెరుగుపరిచే ఉత్తమమైన ఆహారం. వీటిలో మెగ్నీషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీర కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. మీ మెదడుకు ట్రిప్టోఫాన్‌ను మెలటోనిన్‌గా మార్చడానికి ఉపయోగపడతాయి.

Bananas :

పడుకునే ముందు అరటిపండ్లు తినడం వల్ల మీరు సులభంగా నిద్రపోతారు. మీ కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. ఇది నిద్రపై సహజ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రను ప్రోత్సహిస్తుంది. చెర్రీ పండ్లు కూడా తింటే మంచి నిద్ర కలుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

రాత్రికి తినకూడని ఆహార పదార్థాలు :

రాత్రి భోజనంలో పెరుగు తినకపోవడం ఉత్తమం. ఇది అసిడిటీ, అజీర్ణం సమస్యలను పెంచుతుంది. పెరుగుకు బదులుగా మజ్జిగ సేవించడం మంచి జీర్ణ ప్రక్రియకు ఉత్తమం.
గోధుమపిండి, మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలు కూడా నైట్ సమయంలో జీర్ణం కావడం చాలా కష్టం. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి.
మటన్ వంటి కఠినమైన మాంసాహారాన్ని రాత్రివేళ తినకూడదు. ఇది త్వరగా జీర్ణం కాదు, కడుపుమంటగా ఉంటుంది, ఉదయం మలబద్ధకంకు కారణం అవుతుంది.
చాక్లెట్‌లు, డెజర్ట్‌లు ఇతర తీపి రుచి కలిగిన ఆహారాలు బరువుగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కష్టం. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
సలాడ్‌లు ఉదయం వేళ, మధ్యాహ్న సమయంలో మంచి ఆహారంగా ఉంటాయి. అదే సమయంలో ఆహారం జీర్ణం కావడానికి తోడ్పాటును అందిస్తాయి. కానీ రాత్రి భోజనంలో సలాడ్లు తినకూడదు. ముఖ్యంగా రాత్రికి పచ్చి సలాడ్లు తినడం కడుపులో అసౌకర్యం కలిగించవచ్చు.
కాఫీ, కెఫీన్ పానీయాలు మిమ్మల్ని చురుకుగా ఉంచేలా చేస్తాయి, మీకు నిద్రభంగం కలిగిస్తాయి. అలాగే ఆల్కాహాల్ కొద్దిసేపు మత్తుని కలిగిస్తుంది, కానీ మిమ్మల్ని నడిరాత్రిలో మేల్కొలుపుతుంది. మూత్రవిసర్జన ఎక్కువ చేయాల్సి వస్తుంది. కాబట్టి రాత్రివేళ వీటికి దూరంగా ఉండాలి.

నిద్రవేళకు మూడు గంటల ముందు భోజనం చేయడం మంచిది. అలాగే సమయానికి నిద్రపోవడం వలన మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.