ఈ వర్షాకాలంలో చిన్నారుల డైట్ లో ఇవి ఉండాల్సిందే.!

వర్షాకాలం వచ్చేసింది.. నిన్న మొన్నటి వరకు ఎండలు తెగ వేధించాయి. ఇంట్లోంచి బయటికి రావడానికి భయపడిపోయి జనాలు ప్రస్తుతం వర్షాలతో హడలెత్తిపోతున్నారు. రోజుల తరబడి తగ్గకుండా వర్షం వేధిస్తుంది. ఇలాంటి సమయంలో ఏ వయసు

ఈ వర్షాకాలంలో చిన్నారుల డైట్ లో ఇవి ఉండాల్సిందే.!


వర్షాకాలం వచ్చేసింది.. నిన్న మొన్నటి వరకు ఎండలు తెగ వేధించాయి. ఇంట్లోంచి బయటికి రావడానికి భయపడిపోయి జనాలు ప్రస్తుతం వర్షాలతో హడలెత్తిపోతున్నారు. రోజుల తరబడి తగ్గకుండా వర్షం వేధిస్తుంది. ఇలాంటి సమయంలో ఏ వయసు వారేనా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలు వర్షాకాలంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు వారిని చుట్టుముడతాయి.
10 ways to help your child to eat well | Nuffield Health
వర్షాకాలంలో చిన్నారుల్ని వేధించే సమస్యల్లో జలుబు, దగ్గు, జ్వరం ముందుంటాయి. అయితే ఈ సీజనల్ వ్యాధులను తేలిగ్గా ఎదుర్కోవాలంటే పిల్లలకి ఇచ్చే డైట్లో కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలు చేర్చాల్సిందే అని తెలుస్తోంది.
వర్షాకాలంలో చిన్నారుల ఆహారంలో కచ్చితంగా విటమిన్స్ అధికంగా ఉండే ఆహారం ఉండాలి. అందులో సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అందివ్వాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఎన్నో అనారోగ్యాలను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని ఇస్తాయి.
ముఖ్యంగా ఈ కాలంలో దొరికే దానిమ్మ, జామ, అరటి వంటి వాటిని పిల్లలకు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. వీటితో పాటు ఉసిరి నారింజ కూడా ఇవ్వడం మంచిదే.
పచ్చని ఆహారం ఉండాల్సిందే.. ఈ కాలంలో పిల్లల ఆహారంలో అన్ని రకాల కాయగూరలు చేర్చడం మంచిది ముఖ్యంగా టమాటా క్యారెట్ ఆకుకూరలు పాలకూర వంటి వాటిని ఉంచటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అల్లం.. అల్లం లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాల అధికంగా ఉంటాయి. ఇవి ఎలాంటి వ్యాధులునైనా అడ్డుకోవడంలో ముందుంటాయి. అందుకే పిల్లలకు ఇచ్చే ఆహారంలో అల్లాన్ని చేర్చడం ముఖ్యం.
రోజుకో గుడ్డు తప్పనిసరి.. గుడ్డులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్స్ సైతం ఎక్కువగా ఉండటం వల్ల ఎదిగే పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే శారీరక ఎదుగుదల సైతం సక్రమంగా ఉండాలంటే ఆహారంలో గుడ్డును చేర్చాల్సిందే.
పిల్లలకు ఇచ్చే ఆహారంలో కొవ్వు తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఈ కాలంలో చాలావరకు బయట దొరికే ఫుడ్ ను పిల్లలకి ఇవ్వకపోవడం మంచిది. ఇంట్లో సైతం అధికంగా నూనెను ఉపయోగించటం తగ్గించాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.