భర్త అంటేనే భార్యకు చిరాకు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..!

భార్యాభర్తల అనుబంధం ఈ ప్రపంచంలోనే ఎంత అద్భుతమైన బంధం అని చెప్పాలి. కలకాలం నిలబెట్టుకోవాల్సిన ఈ బంధంలో ఏమాత్రం కలతలు వచ్చినా ఎందరో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కోసారి ఇది తీవ్రంగా మారి విడాకులకు దారితీస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది మహిళలు పెళ్లి విషయంలో విరక్తి చెందటానికి ప్రధాన కారణాలు ఏంటంటే..

భర్త అంటేనే భార్యకు చిరాకు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..!


భార్యాభర్తల అనుబంధం ఈ ప్రపంచంలోనే ఎంత అద్భుతమైన బంధం అని చెప్పాలి. కలకాలం నిలబెట్టుకోవాల్సిన ఈ బంధంలో ఏమాత్రం కలతలు వచ్చినా ఎందరో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కోసారి ఇది తీవ్రంగా మారి విడాకులకు దారితీస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది మహిళలు పెళ్లి విషయంలో విరక్తి చెందటానికి ప్రధాన కారణాలు ఏంటంటే..
How To Get Out Of A Fight With Your Husband

కమ్యూనికేషన్ లేకపోవడం..

ప్రతి భర్త తను ఎంతో కష్టపడి సంపాదించేది కుటుంబం కోసమే అనుకుంటాడు. తన భార్య కోసమే ఇదంతా అని అనుకుంటాడు. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన వెంట పడి భార్యతో ప్రేమగా మాట్లాడటం సైతం మర్చిపోతారు. ముఖ్యంగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లోపం తలెత్తినప్పుడే భార్యకు భర్తంటే చిరాకు వస్తుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ తగ్గిపోతుందో  సాధారణంగా ఆడవారిలో ఇంట్రెస్ట్ తగ్గుతుంది. పార్టనర్ తమతో వినడం, మాట్లాడడం లేదనే ఆడవారు సాధారణంగా ఇంట్రెస్ట్‌ని కోల్పోతారు.

నమ్మకం తగ్గడం..

తమ పార్టనర్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న ఆడవారు వారికి తెలియకుండానే పార్ట్నర్ కు దూరమైపోతారు. మనస్పర్ధలు తెచ్చుకుంటారు.. అందుకే నమ్మకం చాలా ముఖ్యం. ఒకసారి నమ్మకం దెబ్బతింటే మళ్ళీ ఏర్పరచుకోవడానికి చాలా సమయం పడుతుంది కొన్నిసార్లు వెనక్కి తిరిగి రాలేదు.

విసుగు..

జీవితంలో కొత్తదనం, హ్యాపీనెస్, ఆసక్తి కోల్పోయినా ఆడవారు మగవారిపై ఇంట్రెస్ట్ కోల్పోతారు. అందుకే, జీవితం ఇంట్రెస్టింగ్‌గా ఉండాలంటే ఎప్పటికీ సర్‌ప్రైజెస్ ఉండాలి. ఏదో ఒక ఆలోచన పరధ్యానంతో ఉండకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని పార్టనర్ను సంతోషంగా ఉంచాలి.

గౌరవం లేకపోవడం..

తమ పార్టనర్ తమకి అవసరమైన గౌరవం, విలువ ఇవ్వకపోయినా ఆడవారు ఇబ్బందిగా ఫీలవుతారు. అందుకే, గౌరవం, విలువ ఇవ్వడమనేది చాలా ముఖ్యం. ఆడవారికి గౌరవం లేని చోట ఉండలేరు అలాగే బయట సమాజంలో కుటుంబ సభ్యుల దగ్గర పార్టనర్ కి ఇచ్చే విలువే మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది.

విభిన్న మనస్తత్వాలు..

ఇద్దరు మనుషుల మనస్తత్వాలు వేరువేరుగా ఉండటం కూడా పెద్ద సమస్య.. పార్టనర్స్ ఇద్దరికీ వేర్వేరు లక్షాలు, వేర్వేరు విలువలు ఉంటే సాన్నిహిత్యం తగ్గుతుంది. కాబట్టి, ఈ కారణం చేత ఆడవారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు.

శారీరక సాన్నిహిత్యం..

ఇదొక్కటే కారణం కాదు. కానీ, ఇద్దరి మధ్య శృంగారం తగ్గినా కూడా పార్టనర్స్ మధ్య సాన్నిహిత్యం తగ్గుతుంది. కాబట్టి, ఆడవారికి ఆ విషయంలో కూడా లోటు లేకుండా చూడాలి. ఏకాంతానికి ఏమాత్రం అడ్డంకి లేకుండా చూసుకోవాలి.

ప్రయత్నం లేకపోవడం..

భాగస్వామి కూడా సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించకపోతే, అది స్త్రీలలో ఆసక్తిని తగ్గించొచ్చు. ఇద్దరికి కూడా కలిసి ఉండాలనే భావన ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్ బావుంటుంది. ఇద్దరు వైపు నుంచి ఒకే రకమైన ప్రేమ అభిమానాలు ఉన్నప్పుడు బంధం మరింత బలపడుతుంది ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఎదుటి మనిషి అర్థం చేసుకోలేని పరిస్థితి వస్తే ఒక మెట్టు దిగి భాగస్వామి వద్దకు వెళ్లడం ఏమాత్రం తప్పు కాదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.