ఆడవారిలో లివర్ సమస్యలకు ప్రధాన కారణాలు ఇవే..!

మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగం లివర్.. ఆహారం జీర్ణం కావడంతో పాటు రక్తాన్ని శుభ్రం చేయడంలో సైతం ప్రముఖ పాత్ర పోషించే లివర్ శరీరంలో ఎన్నో పనులను నియంత్రిస్తుంది. ఆహారం జీర్ణం అయిన తర్వాత హార్మోన్‌, ఎంజైమ్‌, ప్రోటీన్‌, కొలస్ట్రాల్‌ను తిరిగి శరీరానికి అందిస్తుంది. రోగనిరోధక శక్తి, జీవక్రియ, పోషకాల సరఫరా, నిల్వ చేయటంలో కాలేయం అవసరం.

ఆడవారిలో లివర్ సమస్యలకు ప్రధాన కారణాలు ఇవే..!


మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగం లివర్.. ఆహారం జీర్ణం కావడంతో పాటు రక్తాన్ని శుభ్రం చేయడంలో సైతం ప్రముఖ పాత్ర పోషించే లివర్ శరీరంలో ఎన్నో పనులను నియంత్రిస్తుంది. ఆహారం జీర్ణం అయిన తర్వాత హార్మోన్‌, ఎంజైమ్‌, ప్రోటీన్‌, కొలస్ట్రాల్‌ను తిరిగి శరీరానికి అందిస్తుంది. రోగనిరోధక శక్తి, జీవక్రియ, పోషకాల సరఫరా, నిల్వ చేయటంలో కాలేయం అవసరం. ఇంత ముఖ్యమైన అవయవం విషయంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతున్నాయి అందులో ముఖ్యంగా ఆడవారికి ఈ సమస్యలు మరింత ఎక్కువగా కనిపించడం వెనుక అసలైన కారణాలు ఏమిటంటే..
Fatty liver disease: Symptoms include spider naevi on your face, neck and  arms | Express.co.uk
ఈ రోజుల్లో లివర్ కు సంబంధించిన ఎన్నో సమస్యలు ఆడవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు ముఖ్యమైన కారణాలు కొన్ని నిర్దిష్ట జీవనశైలి అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ఈ ప్రమాదానికి కారణం అవుతాయి. మహిళలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూన్-సంబంధిత కాలేయ వాపు, హెపటైటిస్‌ మహిళల్లో చాలా తరచుగా సంభివంచవచ్చు. 

మహిళల్లో లివర్ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు.. 

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్..

మహిళల్లో NAFLD వచ్చే ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ, వారిలో అది వచ్చిన తర్వాత తీవ్రమయ్యే, ఫైబ్రోసిస్‌ డవెలప్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అధిక బరువు, నిశ్చల జీవనశైలి, ఆరోగ్యానికి ప్రాధాన్యత లేకపోవడం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణం అవుతాయి. మహిళలు, పురుషులలో లివర్‌ సమస్యలకు ప్రధాన కారణాలలో NAFLD ఒకటి. ఇది సాధారణంగా ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్‌తో సంబంధం ఉన్నట్లు గుర్తించారు.​

ఆటో ఇమ్యూన్ హెపటైటిస్..

ఈ వ్యాధి ఒకసారి వస్తే దీర్ఘకాలం వేధించే అవకాశం ఉంటుంది. శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ మన శరీరంలో ఉండే కణాలపైనే దాడి చేయడం ఇందులో కనిపించే ప్రధాన సమస్య.. ఇందులో ఇన్ఫ్లమేషన్, కాలేయం దెబ్బతింటుంది. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ మగవారి కంటే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

వైరల్ హెపటైటిస్..

హెపటైటిస్ A, B, C, D, Eతో సహా హెపటైటిస్ వైరస్ కాలేయ వాపు, వ్యాధికి కారణమవుతాయి. వైరల్ హెపటైటిస్ ఎక్కువగా కనిపించే వ్యాధి.

గర్భధారణ సంబంధిత కాలేయ సమస్యలు..

ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ICP), హెల్ప్ సిండ్రోమ్ (హీమోలిసిస్, ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్‌లు, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్) వంటివి గర్భధారణ సమయంలో లివర్‌కు వచ్చే సమస్యలు. ఈ సమస్యలు లివర్‌ పనితీరును దెబ్బతీస్తాయి. ఇవి దీర్ఘకాలం వేధిస్తాయి.

విల్సన్ సమస్య..

ఈ అరుదైన జన్యుపరమైన రుగ్మత.. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. లివర్‌, ఇతర అవయవాలలో సమస్యలు ఏర్పడటానికి దారితీస్తుంది. విల్సన్ వ్యాధి ఆడవారిని, మగవారిని ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. కానీ హార్మోన్ల ప్రభావాల కారణంగా ఆడవారిలో భిన్నంగా ఉండవచ్చు.

ఆల్కహాలిక్ లివర్‌ సమస్య..

ఆల్కహాల్‌ ఎక్కువగా తాగితే లివర్‌ దెబ్బతింటుంది, వాపు, సిర్రోసిస్‌కు దారితీస్తుంది. ఆల్కహాలిక్ లివర్‌ సమస్యల ముప్పు మగవారిలో ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆల్కహాల్ జీవక్రియ. శరీర కూర్పులో తేడాల కారణంగా మహిళల్లో ఆల్కహాల్-సంబంధిత కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.​

చాలా రకాల వ్యాధులకు ఉపయోగించే మెడిసిన్స్..

ఎన్నో వ్యాధుల్లో దీర్ఘకాలం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కొన్ని మందులు, టాక్సిన్స్ కాలేయాన్ని దెబ్బతీస్తాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళలకు ఎక్కువగా ఈ ప్రమాదం ఉండవచ్చు. గర్భనిరోధక మాత్రలు లివర్ పనితీరుని ప్రభావితం చేస్తాయి. కొన్ని ప్రత్యామ్నాయ మందులు కూడా తీవ్రమైన కాలేయ వైఫల్యానికి కారణమవుతాయి.

ప్రైమరీ బిలియరీ కోలాంగైటిస్ (PBC)

PBC అనేది ఆటో ఇమ్యూన్‌ కండీషన్‌, ఇది ప్రధానంగా లివర్‌ పిత్త వాహికలను ప్రభావితం చేస్తుంది. మధ్య వయస్కులైన స్త్రీలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.