Mental stress : శారీరక శ్రమతో మానసిక ఒత్తిడిని జయించవచ్చా..!

నిజానికి ఎలాంటి mental stress నైనా జయించాలి అంటే physical activity కలిగించాలని అంటున్నారు మానసిక నిపుణులు.. Stress ని జయించడానికి ఏ రకమైన వ్యాయామాన్ని ఎంచుకున్న కచ్చితంగా ఫలితం ఉంటుందని తెలుస్తోంది..

Mental stress : శారీరక శ్రమతో మానసిక ఒత్తిడిని జయించవచ్చా..!
Mental stress can be overcome with physical activity


Stress వలన ఎన్నో రకాల సమస్యలు దరిచేరుతాయి అయితే చుట్టూ ఉన్న సమస్యలతో ప్రతి ఒక్కరికి Stress సమస్య వేధించడం కనిపిస్తూనే ఉంటుంది.. అయితే Physical activities వల్ల Mental stress దూరం అవుతుందని తెలుస్తోంది ఇది ఎలా అంటే..

నిజానికి ఎలాంటి మానసిక ఒత్తిడినైనా జయించాలి అంటే శరీరానికి శ్రమ కలిగించాలని అంటున్నారు మానసిక నిపుణులు.. ఒత్తిడిని జయించడానికి ఏ రకమైన వ్యాయామాన్ని ఎంచుకున్న కచ్చితంగా ఫలితం ఉంటుందని తెలుస్తోంది.. రోజులో కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుందని తెలుస్తోంది. 

చాలావరకు ఒత్తిడిలో ఉన్న వారికి రెండు సమయాల్లో అధికంగా బాధ కలుగుతుందని తాజా అధ్యాయనాల్లో తేలింది.. అవి రాత్రి నిద్రపోయే సమయం.. ఉదయం మేల్కొని సమయం.. ఈ రెండు సమయాలు గతం తాలూకా.. భవిష్యత్తు తాలూకా.. ఎన్నో విషయాలని పలుమార్లు గుర్తు చేసి బాధిస్తాయని తెలుస్తోంది.. అలాగే ఏ రకమైన బాధ అయినా 24 గంటలకు మించి ఉండదని నిపుణులు అంటున్నారు.. ఆశ్చర్యం కలిగించిన ఈ విషయం నిజం.. మనిషికి అత్యంత బాధ కలిగించే ఒక విషయం తెలిసిన వెంటనే అతను కేవలం ఒక నిద్ర చేసిన తర్వాత దాని తాలూకా ప్రభావం చాలా వరకు తగ్గుతుందని తెలుస్తోంది అయితే కొందరు మాత్రం ఈ బాధ నుంచి బయట పడాలి అనుకొని మానసికంగా సిద్ధమైతే మరి కొందరు మాత్రం జరిగిపోయిన విషయాలను తలచుకొని బాధపడుతూ ఉంటారు ఏది ఏమైనా ఇది తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది దీని నుంచి బయటపడాలి అంటే.. 

ఉదయాన్నే నిద్ర లేచి కాసేపు వ్యాయామానికి కేటాయించాలి. ఇలా చేయడం వల్ల శరీరం పూర్తిస్థాయిలో అలసిపోతుంది. అలాగే ఒత్తిడి సమయంలో ఆకలి అనిపించదు. వ్యాయామంతో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది దీంతో సమయానికి తినడంతో పాటు నిద్ర కూడా అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎలాంటి ఒత్తిడి నైనా జయించగలిగే సామర్థ్యాన్ని ఇస్తాయని తెలుస్తోంది.. అలాగే ముఖ్యంగా ఈ వ్యాయామం సమయంలో ఏదో ఒక రకంగా బయట కొందరైనా కనిపిస్తారు ప్రకృతితో మమేకమయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తమ ఒంటరిమే కాదు అనే నమ్మకాన్ని ఇస్తాయి. అలాగే మన కోసం మన కేటాయించుకునే ఈ కొంత సమయం జీవితంలో ఏదో సాధించాలి అని ఆలోచన ఇస్తాయని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మార్గం చూపిస్తాయని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.