కుండలో నీరు తాగితే ఎన్ని లభాలో? ఈ  సమస్యలు కూడా దూరం..!

ఎండలు పెరగడం వల్ల చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే, ఫ్రిజ్‌లోని చల్లని నీరు కాకుండా కుండ నీరు తాగడం మంచిదని అంటున్నారు నిపుణులు.

కుండలో నీరు తాగితే ఎన్ని లభాలో? ఈ  సమస్యలు కూడా దూరం..!


ఎండలు పెరగడం వల్ల చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే, ఫ్రిజ్‌లోని చల్లని నీరు కాకుండా కుండ నీరు తాగడం మంచిదని అంటున్నారు నిపుణులు. మరి కుండలోని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో తెలుసుకుందాం...

Matka (earthen pot ) water is magical for your health! Here's why | The  Times of India

ఖనిజాలు.. మట్టి పాత్రల్లోని నీటిలో ఖనిజాలు, ట్రేస్ ఎలిమెంట్స్ సహజంగా ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. రెగ్యులర్‌గా ఈ నీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

గాయాలు త్వరగా... కుండలోని నీటిలో సహజ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల గాయలు దెబ్బలు కూడా త్వరగా తగ్గుతాయట. 

 సహజంగానే చల్లగా.. కుండల్లో నీరు సహజంగానే చల్లగా ఉంటుంది. ఫ్రిజ్‌లో నీరు తాగడం వల్ల లేనిపోని సమస్యలొస్తాయట. కాబట్టి, కుండలోని నీరు తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

​వేడిని.. ఫ్రిజ్‌లో నీరు తాగడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుందట, కుండలో నీరు తాగితే శరీరంలోని వేడి తగ్గుతుందట.

జీర్ణ సమస్యలు దూరం.. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అందుకే  రెగ్యులర్‌గా కుండలో నీరు తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. 

మెటబాలిజం పెరగడం.. మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్లే చాలా మంది బరువు పెరుగుతారు. జీవ క్రియ సరిగ్గా ఉంటే జీర్ణ సమస్యలు దూరమై బరువు కూడా తగ్గుతారు.

గొంతునొప్పి.. ఈ నీటిని తాగడం వల్ల గొంతు సమస్యలు కూడా ఎక్కువగా రావట. ఒకవేళ వచ్చినా సమస్య త్వరగా తగ్గుతుందట. కాబట్టి..  ఏ కాలంలో అయినా..  వర్షాకాలం, చలికాలంలోనూ ఈ కుండ నీటిని తాగొచ్చుని అంటున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.