వేసవిలో నిమ్మరసం ఇలా తాగితే మీ పని ఇక అంతే!

వేసవి కాలంలో  వడగాల్పులు, ఉక్కబోతతో చాలా మంది డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటారు. బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు  శీతల పానియాలు తాగుతుంటారు. కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు, చెరుకు రసం, నిమ్మరసాన్ని చాలామంది తీసుకుంటూ ఉంటారు.

వేసవిలో నిమ్మరసం ఇలా తాగితే మీ పని ఇక అంతే!


వేసవి కాలంలో  వడగాల్పులు, ఉక్కబోతతో చాలా మంది డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటారు. బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు  శీతల పానియాలు తాగుతుంటారు. కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు, చెరుకు రసం, నిమ్మరసాన్ని చాలామంది తీసుకుంటూ ఉంటారు. అయితే ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే నిమ్మకాయల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

I Drank Lemon Water Every Morning & Noticed These Effects

 ఎండాకాలంలో వడదెబ్బకు గరి కాకుండా నిమ్మ కాపాడుతుంది. అలాగే రక్తప్రసరణ బాగా జరగడానికి కూడా నిమ్మరసం సహాయపడుతుంది.

నిమ్మకాయలో పోషక విలువలను చాలా ఉంటాయి.
శక్తి, పిండి పదార్థాలు, చక్కెర, పీచు పదార్థాలు, కొవ్వు పదార్ధాలు, ప్రోటీన్, మాంసకృతులు, మెగ్నీషియం, పాస్పరస్, నీరు, విటమిన్ సీ, సిట్రిక్ యాసిడ్.. 
ఇంకా నిమ్మకాయలో విటమిన్ బి కూడా ఉంటుంది.

ఇన్ని పోషకాలు ఉన్న నిమ్మరసాన్ని తీసిన వెంటనే తాగితేనే ఆరోగ్యానికి మంచిది.  నిల్వ చేసి తీసుకోకూడదని  నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మరసాన్ని నిల్వ చేయడం వల్ల పాడై పోవడమే కాకుండా పోషక విలువలు తగ్గుతాయట.  ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల కూడా వాటి సహజతత్వాన్ని కోల్పోతాయి. 

నిమ్మరసాన్ని ఎలా తాగితే మంచిదంటే..

మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగితే మరింత మంచిది. మంచినీరులో నిమ్మరసంతో పాటు చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే ఎండాకాలం వేడి నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. 

నిమ్మకాయలో సీ విటమిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది.  

రక్తపోటును నియంత్రించడంతో పాటు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంతో ఉపయోగపడతాయి.

నిమ్మకాయలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే క్యాన్సర్ కారకాలు పెరగనీయకుండా  కాపాడుతుంది. బరువును తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉంటాయి.

ఇక పెరుగుతో నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య కూడా దూరమవుతుంది. తేనెతో కలిసి నిమ్మరసం తీసుకుంటే అజీర్తి సమస్య తొలగిపోతుంది. నోటి దుర్వాసనను కూడా రాదు.

చర్మంపై వచ్చే మెటిమలను కూడా తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. చర్మంపై ముడతలు రాకుండా చేయడం, కాలిన మచ్చలను తొలగించడం, చర్మాన్ని కాంతివంతగా చేయడంలో నిమ్మ బాగా ఉపయోగపడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.