వేసవిలో ఈ ఫ్రూట్ వెరీ స్పెషల్.. తింటే ఎక్కువ అందం, ఆరోగ్యం మీ సొంతం!

ఎండాకాలంలో ఉక్కబోత సమస్య  వల్ల చెమట ఎక్కువగా పట్టడం, ఫలితంగా శరీరం నుంచి నీరు బయటకు వెళ్లడం జరుగుతుంది. అలా శరీరంలో నీటి శాతం తక్కువ కావడం వల్ల..  చాలామంది డీహైడ్రేషన్‌ అవుతారు. దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.

వేసవిలో ఈ ఫ్రూట్ వెరీ స్పెషల్.. తింటే ఎక్కువ అందం, ఆరోగ్యం మీ సొంతం!


ఎండాకాలంలో ఉక్కబోత సమస్య  వల్ల చెమట ఎక్కువగా పట్టడం, ఫలితంగా శరీరం నుంచి నీరు బయటకు వెళ్లడం జరుగుతుంది. అలా శరీరంలో నీటి శాతం తక్కువ కావడం వల్ల..  చాలామంది డీహైడ్రేషన్‌ అవుతారు. దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్‌తో పాటు వడదెబ్బకు గురై చాలామంది అనారోగ్యం బారిన పడతారు. అందుకే ఎండాకాలంలో శరీరం చల్లబడటానికి శీతల పానీయాలు, జూస్ కు తీసుకుంటూ ఉంటాం. అలాగే శరీరానికి చల్లదనం అందించే పుచ్చకాయ, ఇతర పండ్లను కూడా తీసుకుంటాం. మరి ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేసవిలో  అన్నమ్మే కాకుండా ఎలాంటి పండ్లు తినాలి? నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు  ఎంటి? కూరగాయలు ఏంటి? తెలుసుకుందాం..

Fruits

ఎండ ప్రభావం నుంచి తట్టుకోవడానికి శరీరానికి చల్లదనం అందించే, నీటి శాతం ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. 

పుచ్చకాయ, ఖర్బూజ, మామిడికాయ, దానిమ్మ, జామకాయ లాంటి నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉండదు.

కూరగాయల్లో కీరదోస, దోసకాయ, క్యారెట్, సోరకాయ, బీరకాయలు వంటి నీటిశాతం అధికంగా ఉంటాయి. ఇవి తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కీరదోసను ముక్కలుగా చేసుకుని సలాడ్‌గా తీసుకోవచ్చు. కీరదోస ముక్కలను కంటి మీద పెట్టుకుంటే శరీరం, కంట్లోని వేడిని లాగేస్తుంది. అలాగే వేసవిలో క్యారెట్‌ కూడా శరీరానికి చల్లదనం కలిగిస్తుంది. దీనిని సలాడ్‌ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచిది.  దోసకాయలో కూడా చలవ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. దీనిని పప్పు, చట్నీ, కూరల్లో వాడి తీసుకోవడం వల్ల చలవ చేస్తుంది.

కమలా పండులో నీటి శాతం ఎక్కువ ఉండడం సహా విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. వేసవిలో కమలా పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రెడ్ క్యాప్సికం ఎండాకాలంలో చర్మం ముడతలు పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే రెడ్ క్యాప్సికం ఎక్కువగా తీసుకుంటే  వేసవిలో చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఎందుకంటే రెడ్ క్యాప్సికంలో ఉండే సీ విటమన్  వేసవిలో చర్మాన్ని కాపాడుతుంది. 

తాటి ముంజలు .. ఇక వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల చలవ చేస్తుంది. అలాగే ఎండకు చాలా మందికి చెమట కాయలు లాంటివి శరీరంపై వస్తాయి.  తాటి ముంజలను పేస్టులా చేసుకుని చెమట కాయలు వచ్చిన చోట పెడితే అవి తగ్గుతాయి. 

వేసవిలో చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవడం మంచిది. టమాటొ, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయాల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరాన్ని ఎండ నుంచి కాపాడటమే కాకుండా అందాన్ని అందిస్తుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.