Back pain : వెన్నునొప్పిని ఇలా తేలికగా తగ్గించుకోండి.. 

Back pain ముఖ్యంగా సరైన శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉండటం అలాగే కూర్చొని చేయాల్సిన పనులు ఎక్కువ అవటం వంటి ఎన్నో కారణాలతో నడుము నొప్పి దీర్ఘకాలం వేధిస్తూ ఉంటుంది..

Back pain : వెన్నునొప్పిని ఇలా తేలికగా తగ్గించుకోండి.. 
reduce back pain easily


Back pain Relief : ఈ కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య వెన్నునొప్పి అయితే నిజానికి తాజాగా జరిగిన అధ్యయనాల్లో ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది ఏదో ఒక సమయంలో ఈ నొప్పితో బాధపడుతూ ఉంటారని తెలుస్తోంది. అయితే నడుము నొప్పి వేధించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.. 

ఈరోజుల్లో మనుషుల జీవనశైలి మారిపోతుంది దీంతో పలు అనర్ధాలు వస్తున్నాయి. ఇందులో ఒకటే వెన్నునొప్పి ముఖ్యంగా సరైన శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉండటం అలాగే కూర్చొని చేయాల్సిన పనులు ఎక్కువ అవటం వంటి ఎన్నో కారణాలతో నడుము నొప్పి దీర్ఘకాలం వేధిస్తూ ఉంటుంది.. ఈ నొప్పి నుంచి బయటపడాలి అంటే బామ్స్ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ ఉంటూనే ఉంటాయి అయితే ఇవన్నీ కూడా తాత్కాలికంగానే పనిచేస్తాయని దీర్ఘకాలం వీటి ప్రభావం ఉండదని తెలుస్తోంది.. 

 స్థూలకాయం ఉన్నవారికి ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎలాంటి వారు బరువు తగ్గటంపై మనసు పెట్టాలి.. అలాగే ఈ నొప్పితో బాధపడేవారు తరచు వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఎన్ని పనులు ఉన్నా టైంకి ఎక్ససైజ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ముఖ్యంగా రెండు చేతుల వేళ్ళతో కాలవేళ్లను ముట్టుకోవాలి ఇలా చేసేటప్పుడు మనుషులు నిటారుగా నిలువడం మాత్రం మర్చిపోకూడదు. అలాగే కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చొని చేసే పనులు ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి అలాగే కూర్చున్న చోట నుంచి లేచి నడవడం అలవాటు చేసుకోవాలి..

అలాగే కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవడం నిలుచున్నప్పుడు పక్కకి వంగిపోకుండా ఉండటం వంటివి చేయడం వల్ల వెన్ను ముక పై భారం పడకుండా ఉంటుంది..  అలాగే వెన్నెముకను సక్రమంగా ఉంచడానికి టేప్, పట్టీలు లేదా స్ట్రెచి బ్యాండ్‌లను ఉపయోగించవచ్చు. అలాగే సమస్య మరి తీవ్రంగా ఉంటే డాక్టర్ని సంప్రదించడం మాత్రం మర్చిపోకూడదు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.