Thyroid gland : శరీరంలో నీరు చేరుతుందా.. ఎలా గుర్తించాలంటే!

Thyroid gland : శరీరంలో నీరు చేరటం చిన్న సమస్యగా కనిపించిన అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం ఏమి కాదు. ఇది నెమ్మదిగా మొదలై తర్వాత పెను సమస్యలకి దారి తీసే అవకాశం ఉంది.

Thyroid gland : శరీరంలో నీరు చేరుతుందా.. ఎలా గుర్తించాలంటే!


Thyriod Gland : శరీరంలో నీరు చేరటం చిన్న సమస్యగా కనిపించిన అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం ఏమి కాదు. ఇది నెమ్మదిగా మొదలై తర్వాత పెను సమస్యలకి దారి తీసే అవకాశం ఉంది.

ఉదయం లేవగానే కళ్ళ కింద వాచిపోయి కనిపించినా ముఖమంతా ఉబ్బరించి ఉన్న ఒంట్లో నీరు చేరుతుందేమో చూసుకోవాలి. అలాగే కాళ్లల్లో నీరు చేరితే బరువుగా అనిపించడం, వాచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది తర్వాత గుండె, మూత్రపిండాలు వంటి వాటిపైన సైతం ప్రభావం చూపుతుంది. అలాగే పొట్ట భాగంలో సైతం నీరు చేరిపోయే అవకాశం ఉంటుంది. లివర్ కూడా పాడయ్యే సూచనలు కనిపిస్తాయి.
సాధారణంగా రక్తంలోంచి నీరు, మూత్రం చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు శరీరంలో ఏమైనా మార్పులు జరిగినప్పుడు శరీరం నీటిని గ్రహించకుండా బయటికి పంపించకుండా అక్కడక్కడా ఉండిపోయే అవకాశం ఉంది. దీనినే ఎడిమా అంటారు.
సాధారణంగా పాదాలలో మొహంలో, చేతుల్లో, పొట్టలో, కాళ్లలో ఈ నీరు చేరటం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది రెండు రకాలుగా ఉంటుందని చెప్పవచ్చు. మొదటి దాంట్లో శరీరమంతా నీరు చేరటం మరొక భాగంలో ఏదో ఒక భాగంలో మాత్రమే నీరు చేరటం.
ఎలా గుర్తించాలంటే..
నిద్రలేవగానే మొహం ఉబ్బరించి ఉండటం..
కాళ్లు పాదాలు మోచేతులు ముం చేతులు వాచినట్లు అనిపించడం..
శరీరంలో ఎక్కడైనా నొక్కితే సొట్ట పడటం..
పొట్ట క్రమంగా ఉబ్బుతూ అనిపించడం..
పొట్ట పైన కొడితే లోపల నుంచి శబ్దం రావడం..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవటం..
సాధారణంగా శరీరంలో థైరాయిడ్ గ్రంధి తక్కువగా పనిచేయడం వల్ల కూడా నీరు చేరే అవకాశం ఉంటుంది. అలాగే పాదాల్లో ముందుగా నీరు చేరినట్టు అనిపిస్తే గుండెలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో చూసుకోవాలి.
నివారణకు ఏం చేయాలంటే..
మజ్జిగతో కలిపి బార్లీ నీళ్లను రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీరం అదనంగా పేరుకుపోయిన నీరు బయటకు పోతుంది. కాళ్లు నీరు చేరి బరువుగా అనిపిస్తున్నప్పుడు కాళ్ళను వేలాడదీసి కూర్చోవడం సరైన పద్ధతి కాదు. కాళ్ళను తగిన ఎత్తులో ఉంచుకోవాలి. ఇలాంటివారు మూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపుకోకూడదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.