మలేరియా జ్వరానికి సాధారణ జ్వరానికి తేడా ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాల్సిందే!

Malaria Fever and Yellow Fever : ముఖ్యంగా మలేరియా వ్యాధిని నివారించడానికి ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా 25th April ను జరుపుకోవడం జరుగుతుంది. అయితే మలేరియా వ్యాధి ఎందుకు వస్తుంది?

మలేరియా జ్వరానికి సాధారణ జ్వరానికి తేడా ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాల్సిందే!


Malaria Fever and Normal Fever : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 25th April ను మలేరియా దినోత్సవం గా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మలేరియా వ్యాధిని నివారించడానికి ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా 25th April ను జరుపుకోవడం జరుగుతుంది. అయితే మలేరియా వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా తగ్గించుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.
సాధారణంగా మలేరియా వ్యాధి పరాన జీవుల వలన వస్తుంది దోమలు మనిషిని కుడితే మలేరియా వస్తుందని అందరికీ తెలుసు. కాకపోతే ఈ దోమ పరాన జీవులను తీసుకువచ్చి మనిషి రక్తం లోకి ఎక్కిస్తుంది. ఆ సమయంలోనే మలేరియా సోకుతుంది. 
మలేరియా అనేది 'ప్లాస్మోడియం' అనే పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి. ఇది మురికి నీటిలో వృద్ధి చెందే ఆడ 'అనాఫిలిస్' దోమ కుట్టడం ద్వారా మనిషికి సోకుతుంది. మలేరియా ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. కొందరిలో 10 రోజులకు లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో ఒక్కరోజులోనే కనిపిస్తాయి. మలేరియా సోకినపుడు ప్రతి వ్యక్తి శరీరం ప్రతిస్పందించే స్థాయి భిన్నంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వ్యక్తులకు మలేరియా సోకినప్పటికీ ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు, అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తికి ఇది ప్రాణాంతకం అవుతుంది. అయితే కేవలం మలేరియా వల్ల శివారంతో పాటు కొందరిలో రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయే అవకాశం ఉంటుంది ఈ మలేరియా ఎక్కువైతే కిడ్నీలు చెడిపోవడం ఫిట్స్ రావడం రక్తహీనత వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

లక్షణాలు ఏంటంటే..

సాధారణంగా మలేరియా సోకినపుడు మనిషి చలిజ్వరంతో బాధపడతాడు. సాధారణంగా సంక్రమణ జరిగిన 10-15 రోజులలో లక్షణాలు కనిపిస్తాయి. 
జ్వరం, చలి, తలనొప్పి, వికారం, వాంతులు, అలసట, పొత్తికడుపు నొప్పి, వేగంగా శ్వాస తీసుకోవడం, దగ్గు మొదలైనవి. 
చలితో గజగజ వణకడం, శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండటం.
జ్వరంతో పాటు చెమటలు పట్టడం, బలహీనంగా అనిపించడం. ఒకటి, రెండు, మూడు రోజుల వరకు జ్వరం వస్తూ ఉండటం.

చికిత్స ఎలా తీసుకోవాలంటే..

జ్వరం ఆగకుండా వేధిస్తూ చలితో శరీరం వణుకుతుంటే కచ్చితంగా రక్త పరీక్ష చేయించుకుని, సరైన చికిత్స తీసుకోవాలి. డాక్టర్‌ని సూచించిన ఔషధాలు తీసుకోవాలి. ఔషధాలు సరైన మోతాదులో తీసుకోకపోతే మళ్లీ మళ్లీ సంభవించే అవకాశం ఉంటుంది.
అలాగే ఇంటి పరిసరాల్లో దోమలు పెరకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి..దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార నియమాలు పాటించాలి. మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలి.
చిన్నపిల్లలు ఉన్న ఇంటి పరిసరాలు మరింత శుభ్రంగా ఉంచుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.