Nervous weakness : మగవాడిని మానసికంగా కుంగదీసి సంసార సుఖాన్ని దూరం చేసే నరాల బలహీనతను ఎలా అధిగమించాలంటే.. 

Nervous weakness in men : ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతో మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పిల్లలు పుట్టకపోవడం. దీంతో ఎంతో మంది భార్యాభర్తలు మానసికంగా కృంగిపోతున్నారు.

Nervous weakness  : మగవాడిని మానసికంగా కుంగదీసి సంసార సుఖాన్ని దూరం చేసే నరాల బలహీనతను ఎలా అధిగమించాలంటే.. 
How to overcome the nervous weakness of man


Nervous weakness in men : ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతో మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పిల్లలు పుట్టకపోవడం. దీంతో ఎంతో మంది భార్యాభర్తలు మానసికంగా కృంగిపోతున్నారు. ఈ రోజుల్లో పిల్లలు పుట్టకపోతే కేవలం తప్పంతా ఆడవారిలో ఉంటుంది అన్నట్టు చూస్తారు. కానీ సగానికి పైగా సమస్య మగవారిలోనే ఉంటుందని చాలామందికి తెలియదు. అందులో ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవటానికి మగవాళ్ళ నరాల బలహీనత ప్రధాన కారణం..

పిల్లలు పుట్టటానికి స్త్రీలో అండం సక్రమంగా విడుదలవటం ఎంత అవసరమో మగవారిలో శుక్రకణం కూడా అంతే అవసరం. విడుదలయ్య అండం ఒక్కటే ఉన్నప్పటికీ శుక్రకణాలు మాత్రం లక్షల సంఖ్యలో విడుదలవుతూ ఉంటాయి. కానీ అవి ఎంతవరకు ఆరోగ్యకరంగా ఉంటాయి అనే మాట ప్రశ్న. చాలామందిలో ఈ శుక్రకణాలు ఆరోగ్యంగా ఉండకపోవటం వల్ల అండాన్ని చేరలేకపోతాయి. ముఖ్యంగా విడుదలైన శుక్రకణాల్లో జీవం లేకపోవడం, కదలిక లేకపోవడం వల్ల గర్భధారణ సాధ్యం కాదు. ఇది మగవారిలో నరాల బలహీనత లక్షణమే దీనికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి.

నరాల బలహీనత తో సంసార సుఖాన్ని సైతం పొందలేక పోతారు. కోరిక ఉన్నప్పటికీ స్తంభన జరగదు. కొన్ని పరిస్థితుల్లో పూర్తిగా స్తంభన జరగదు. కొన్నిసార్లు జరిగిన కొంత వరకే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్న శుక్రకణాలు తెల్లగా ఉండి తీపి వాసన వస్తూ ఉంటాయి. కానీ శుక్రకణాల్లో వాసనలోనూ, రంగులోను ఏవైనా మార్పులు ఉంటే కచ్చితంగా దోషంగానే పరిగణించాలి. అందుకే ఈ నరాల బలహీనతను అధిగమించాలి.

పాలు మగవాడిలో నరాల బనహీనతని దూరం చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే రోజు వీలైతే రెండు పూటలా స్వచ్ఛమైన పాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే యోగాను అభ్యసనం చేయాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి ముందు వాము తిని తర్వాత నీళ్లు తాగితే నరాలు బలహీనత తగ్గుతుంది. గేద పాలు, తేనె, పటిక బెల్లం, నెయ్యి వంటివి నరాల బలహీనతను అదుపులో ఉంచుతాయి. అలాగే ఖర్జూరం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఖర్జూరాన్ని స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో నానబెట్టి తీసుకోవడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది. రోజు ఎలాంటి ఆహారం తీసుకున్న కచ్చితంగా పచ్చి ఉల్లిపాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.