చిగుళ్ళ నుంచి రక్తం కారుతుందా..  జామకాయ మంచి పరిష్కారం..

ఎన్నో పోషక విలువలు కలిగియున్న Guava ను రోజు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థం శరీరంలో ఉండే చాలా రకాల వ్యాధుల్ని నయం చేయడానికి సహాయపడుతుంది.

చిగుళ్ళ నుంచి రక్తం కారుతుందా..  జామకాయ మంచి పరిష్కారం..
Benefits of guava for bleeding gums


Bleeding gums : ఎన్నో పోషక విలువలు కలిగియున్న Guava ను రోజు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థం శరీరంలో ఉండే చాలా రకాల వ్యాధుల్ని నయం చేయడానికి సహాయపడుతుంది.

జామ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. విరివిరిగా దొరికే జామను తీసుకోవడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే సమస్య దూరం అవుతుంది. అలాగే ఏవైనా చిన్న చిన్న గాయాలు తగిలినప్పుడు జామ ఆకుల రసం రాస్తే తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది. ఇది రక్తాన్ని గడ్డ కట్టించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

జామకాయను తరచూ తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఉండే సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఆస్తమా, మూర్చ, తల తిరగడం వంటి సమస్యలు ఉన్నవారికి జామ మంచి ఔషధం. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరచడంలో జామ ముందుంటుంది. పళ్ల కి చిగుళ్ళకు సంబంధించిన పలు రకాల సమస్యలు తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం రావడం, చిగుళ్ళు వాయడం, పళ్లలో జువ్వుమని అనిపించడం ఇలాంటి సమస్యలు అన్నిటికీ జామ మంచి వైద్యంగా పనిచేస్తుంది.

అలాగే నోటి చిగుళ్ళ నుంచి రక్తం అధికంగా వస్తూ ఉంటే జామకాయ ముక్కల పైన ఉప్పు వేసి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా జామకాయల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు.
పెద్ద వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పులు నివారించడంలో జామ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తరచూ జిగట విరేచనాలు అవుతుంటే జామకాయలు తీసుకోవాలి. ఇందులో ఉండే ప్రత్యేక లక్షణాలు చిన్న పేగుల్లో ఉన్న క్రిముల్ని అడ్డగించి జిగురు పదార్ధాన్ని తొలగిస్తుంది. మలబద్దకాన్ని నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.