Ice water : ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్లో ఉంచిన ఐస్ నీరు తాగొద్దు..  ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే..

Ice water : బాగా ఎండలో తిరిగి వచ్చి గడగడ ఫ్రిజ్లో ఉన్న చల్ల నీళ్లు తీసుకుని తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా పొట్టలో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాల మీద ప్రభావం ఉంటుంది.

Ice water : ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్లో ఉంచిన ఐస్ నీరు తాగొద్దు..  ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే..
Do not drink ice water in this summer


Ice water in summer : ఎండాకాలం వస్తే చాలు చాలామందిని వేధించే సమస్య వేడి చేయడం. సరిగ్గా నీరు తీసుకోకపోయినా, సమయానికి ఆహారం తినకపోయినా ఎక్కువ ప్రయాణాలు చేసినా, నిద్ర లేకపోయినా శరీరం వేడి చేస్తోంది. చల్లని పదార్థాలు తిన్న, కారం, మసాలా ఆహారం ఎక్కువగా తీసుకున్న ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏ పదార్థాలు తింటే వేడి చేస్తాయో ఏవి తింటే చలవ చేస్తాయో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

బయట తిరిగి రాగానే చల్లటి నీళ్ల కోసం ఫ్రిజ్ ను ఓపెన్ చేసి అలవాటు చాలామందికి ఉంటుంది. బాగా ఎండలో తిరిగి వచ్చి గడగడ ఫ్రిజ్లో ఉన్న చల్ల నీళ్లు తీసుకుని తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా పొట్టలో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాల మీద ప్రభావం ఉంటుంది. అందుకే ఎండాకాలంలో వీటికి కచ్చితంగా ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి.

ఫ్రిజ్లో ఉంచిన చల్లని పదార్థాలు చలవ చేస్తాయని చాలా మంది భ్రమలో ఉంటారు. కానీ ఇవి విపరీతంగా వేడిని కలిగిస్తాయి. ఎక్కువ కారం ఉప్పు, పులుపు వంటి ఆహార పదార్థాలు మనిషికి వేడిని కలిగిస్తాయి. కొంతవరకు తీపి పదార్థాలు చేదు, వగరు వంటి పదార్థాలు చలవ చేస్తాయి.

ముఖ్యంగా ఫ్రిజ్లో ఉంచిన పదార్థాలని, ఐస్ నీళ్ళని ఎండాకాలంలో అసలు తీసుకోకూడదు. ఇవి చల్లగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పాడు చేస్తాయి. దీనివలన తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక అజీర్తి సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా తీసుకున్న ఆహారం పోషక విలువలు శరీరానికి అందవు. అందుకే మరీ చల్లటి నీళ్లు తాగకుండా ఉండలేని వారు బయట దొరికే కుండలను తెచ్చుకొని ఉంచుకోవడం మంచిది. వీటిలో నీరు కూడా ఎంతో చల్లగా అనిపిస్తుంది. అంతేకాకుండా శరీరానికి మేలు చేస్తుంది కూడా.

ఆకలి తగ్గిపోవడమే కాకుండా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నీరసం చికాకు కాళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి.

ముఖ్యంగా చాలామందికి సగం కోసిన పళ్ళను ఫ్రిజ్లో ఉంచే అలవాటు ఉంటుంది. ఇది కూడా ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. వీలైతే కోసిన వెంటనే తినేయడం మంచిది లేదంటే ఒక పూట వరకు బయట ఉంచటం వల్ల అందులో ఉన్న పోషకాలు అలాగే ఉంటాయి. ఫ్రిజ్లో పెట్టడం వల్ల అందులో ఉండే పోషకాలు అన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయలు వంటి వాటిని ఎక్కువగా ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. ఇలా కాకుండా వాటిని కట్ చేసిన వెంటనే తీసుకోవడం మంచిది.

ఈ ఎండాకాలంలో చలవ చేసే పదార్థాలను తీసుకోవాలి. అంజీర, రేగుపళ్ళు, ద్రాక్ష, దానిమ్మ వంటివి శరీరానికి మేలు చేస్తాయి. వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తాయి. సహజమైన ద్రాక్షరసం, నిమ్మరసం కలిపిన నీళ్లు తీసుకోవడం మంచిది. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, దానిమ్మరసం, బార్లీ నీళ్లు మేలు చేస్తాయి.

ఎండాకాలంలో ఎక్కువగా పదార్థాలని ఫ్రిజ్లో నిల్వ ఉంచి వాటిని తీసుకోకపోవడం మంచిది. అప్పటికప్పుడు వేడిగా వండుకొని తినటం వల్ల శరీరానికి ఎలాంటి సమస్య ఉండదు. పెరుగు కన్నా మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం మంచిది. టీ కాఫీ వంటివి ఎక్కువసార్లు తీసుకోవడం కన్నా మంచినీరు మజ్జిగ వంటివి తీసుకోవటం మేలు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.