Bottle gourd juice : సొరకాయ జ్యూస్‌ రోజు తాగితే ఎన్ని లాభాలో..

Bottle gourd ను చాలా తక్కువ మంది వాడతారు. ఈ కూర అంటేనే నచ్చదు.. ఏదో సాంబార్లో అయితే వేసుకుని తింటారు. Bottle gourd juice ను డైలీ తాగితే..ఎన్నో లాభాలు.. బరువు తగ్గాలని ప్లాన్‌లో ఉన్నవాళ్లు సొరకాయ జ్యూస్‌ను తాగితే చాలు.

Bottle gourd juice : సొరకాయ జ్యూస్‌ రోజు తాగితే ఎన్ని లాభాలో..
Benefits of Bottle gourd juice


Bottle gourd ను చాలా తక్కువ మంది వాడతారు. ఈ కూర అంటేనే నచ్చదు.. ఏదో సాంబార్లో అయితే వేసుకుని తింటారు. Bottle gourd juice ను డైలీ తాగితే..ఎన్నో లాభాలు.. బరువు తగ్గాలని ప్లాన్‌లో ఉన్నవాళ్లు bottle gourd juice ను తాగితే చాలు. త్వరగా. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. సొర‌కాయ‌ల్లో బి విట‌మిన్లు, ఫైబ‌ర్, నీరు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో పాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను దృఢంగా మారుస్తాయి. సొర‌కాయ‌లను తీసుకుంటే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

సొర‌కాయ జ్యూస్..

సొర‌కాయ జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. 
వీటిల్లో బి విట‌మిన్లు, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి బ‌రువును త‌గ్గిస్తాయి. 
విట‌మిన్లు ఎ, సి, కె, ఇ, ఫోలేట్‌, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి ఇత‌ర పోష‌కాలు కూడా సొర‌కాయ‌ల్లో ఉంటాయి. అందువ‌ల్ల సొర‌కాయ జ్యూస్‌ను తాగితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. 

దీంతోపాటు శ‌క్తి ల‌భిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత ప‌నిచేసినా అల‌సిపోరు. రోజూ నీర‌సంగా, అల‌స‌ట‌గా ఉంటుంద‌ని అనుకునేవారు సొర‌కాయ‌ల‌ను జ్యూస్‌గా చేసుకుని తీసుకుంటే శ‌క్తి ల‌భిస్తుంది. 
డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఈ జ్యూస్ ఎంత‌గానో మేలు చేస్తుంది. షుగ‌ర్ లెవ‌ల్స్, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవ‌చ్చు.

ఇంట్లోనే సొర‌కాయ జ్యూస్‌ను ఇలా త‌యారు చేసుకోండి..

1 లేదా 2 చిన్న సొర‌కాయ‌ల‌ను తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయండి. వాటిని జ్యూస‌ర్ గ్రైండ‌ర్‌లో వేసి జ్యూస్ చేయండి.. ఆ జ్యూస్‌ను ఒక గ్లాస్‌లో పోయండి. అందులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా క‌ల‌పండి. అందులో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌ల‌పండి. అవ‌స‌రం అనుకుంటే రుచి కోసం త‌గినంత న‌ల్ల ఉప్పును క‌లుపుకోవ‌చ్చు. దీంతో జ్యూస్ రెడీ అవుతుంది. దీన్ని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో తీసుకోవ‌చ్చు. లేదా ప‌ర‌గ‌డుపున కూడా తాగ‌వ‌చ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.