Edema : ముఖం, చేతులు, కాళ్లు వాస్తున్నాయా..? 'ఎడిమా' కావొచ్చు.

Edema : కొంతమందికి face, legs, hands ల్లో వాపులు ఉంటాయి.. శరీరంలో ఉన్నట్టుండి ఈ మార్పులు వస్తే ఆలోచించాల్సినా విషయమే.. ఎందుకంటే ఏదో ఒక సమస్య ఉంటేనే ఇలా శరీరంలో వాపులు వస్తాయి..

Edema  : ముఖం, చేతులు, కాళ్లు వాస్తున్నాయా..? 'ఎడిమా' కావొచ్చు.
It can be edema if face hands and feet swollen


Edema : కొంతమందికి face, legs, hands ల్లో వాపులు ఉంటాయి.. శరీరంలో ఉన్నట్టుండి ఈ మార్పులు వస్తే ఆలోచించాల్సినా విషయమే.. ఎందుకంటే ఏదో ఒక సమస్య ఉంటేనే ఇలా శరీరంలో వాపులు వస్తాయి.. వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలను గమనించకపోతే..అవి ఇతర సమస్యలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు, చేతులు.. వాపులకు లోనై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

ఎడిమా లక్షణం కావొచ్చు..

మన శరీరంలో ముఖం, కాళ్లు, చేతుల్లో వాపులు బాగా కనిపిస్తుంటే.. దాన్ని ఎడిమా అంటారు. శరీరంలో సోడియం ఎక్కువ కావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడడం, నీళ్లను సరిగ్గా తాగకపోవడం, సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వంటి కారణాల వల్ల ముఖం, చేతులు, కాళ్లలో వాపులు వస్తాయి. ఆయా భాగాల్లో నీరు చేరి వాపులు వస్తాయి.

ఉప్పుతో ముప్పే..

నీళ్లను తక్కువగా తాగితే శరీరంలో ఉన్న సోడియం బయటకు పోకుండా పేరుకుపోతుంది. దీంతో ఆ సోడియం కిడ్నీల్లో చేరుతుంది. ఫలితంగా శరీరం మొత్తం వాపులకు గురై కనిపిస్తుంది. ఇలా వాపులు వచ్చినవారు వెంటనే జాగ్రత్త పడాలి. వీటిని తగ్గించుకునేందుకు ఒక అద్భుతమైన చిట్కా పనిచేస్తుంది. అందుకు ఏం చేయాలంటే..

ఇలా చేయండి చాలు..

రెండు గ్లాసుల నీళ్లను తీసుకుని అందులో అర కప్పు ధనియాలు వేసి మరిగించాలి. నీళ్లు గ్లాస్‌ అయ్యే వరకు మరిగించండి. ఆ కషాయాన్ని తాగాలి. ఇలా రోజూ పరగడుపునే తాగితే.. దీంతో శరీరంలో ఉన్నవాపులు తొలగిపోతాయి. వరుసగా 3 రోజుల పాటు ఈ కషాయాన్ని తాగితే చాలా వరకు వాపులు తగ్గిపోతాయి. ఇంకో 3 రోజుల పాటు ఈ కషాయాన్ని మళ్లీ తీసుకుంటే సమస్య మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది. వాపుల సమస్య ఉన్నవారు రోజువారి ఆహారంలో ఉప్పును తక్కువగా తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేయాలి. దీంతో వాపులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.