White pepper : తెల్ల మిరియాలతో జీర్ణవ్యవస్థ పరుగులు పెడుతుంది..! ఇక మలబద్ధకం మాటే ఉండదు..!

మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేసి, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో white pepper ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న పొట్ట‌లో నిమిషానికి మూడు సార్లు స‌ముద్రంలో అల‌ల మాదిరి ఉండే త‌రంగాలు వ‌స్తుంటాయి.

White pepper : తెల్ల మిరియాలతో జీర్ణవ్యవస్థ పరుగులు పెడుతుంది..! ఇక మలబద్ధకం మాటే ఉండదు..!
Benefits of white pepper


White pepper : మిరియాలు అంటే.. నల్లగా నిగనిగలాడేవి మాత్రమే మనకు తెలుసు.. వీటితో చేసిన రసం ఉంటుంది.. అబ్బో.. నెక్ట్స్‌ లెవల్‌ అంతే.. మిరియాల వల్ల.. జ‌లుబు, ద‌గ్గు, క‌ఫంతోపాటు ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. మిరియాల‌ల్లో మ‌రొక ర‌కం మిరియాలు కూడా ఉంటాయి. అవే తెల్ల మిరియాలు. ఇవి కూడా మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తాయి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు.. తెల్ల మిరియాల వ‌ల్ల బోలెడు లాభాలు ఉన్నాయి తెలుసా..?

మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేసి, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో తెల్ల మిరియాలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న పొట్ట‌లో నిమిషానికి మూడు సార్లు స‌ముద్రంలో అల‌ల మాదిరి ఉండే త‌రంగాలు వ‌స్తుంటాయి. వీటిని పెరిస్టాలిసిస్ మూమెంట్స్ అంటారు. ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వ‌డానికి ఇవి హెల్ప్ అవుతాయి..మ‌నం తిన్న ఆహారం జీర్ణాశ‌యం, పేగుల‌ల్లో నిల్వ ఉండ‌డం వ‌ల్ల ఆహారం పులిసి గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. పెరిస్టాలిసిస్ మూమెంట్స్ రావ‌డం వ‌ల్ల మ‌నం తిన్న ఆహారం జీర్ణాశ‌యం, పేగుల‌ల్లో ఒకే చోట నిల్వ ఉండ‌కుండా కిందికి జ‌రుగుతుంది. దీని వ‌ల్ల ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అయ్యి గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

అయితే.. కొంద‌రిలో ఈ పెరిస్టాలిసిస్ మూమెంట్స్ ఎక్కువ‌గా రావు. దీని వ‌ల్ల ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వ‌క గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. తెల్ల మిరియాల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. తెల్ల మిరియాలు మ‌న జీర్ణాశ‌యం, పేగుల‌ల్లో పెరిస్టాలిసిస్ మూమెంట్స్ ఎక్కువ‌గా వ‌చ్చేలా చేయ‌డంలో అద్భుతంగా పనిచేస్తాయి..ఈ మూమెంట్స్ ఎక్కువ‌గా రావ‌డం వ‌ల్ల ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది. గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

మ‌న జీర్ణాశ‌యంలో అనేక ర‌కాల యాసిడ్‌లు, ఎంజైమ్స్ ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి ఆహారం జీర్ణం అవ్వ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అజీర్తి స‌మ‌స్య ఉన్న వారు తెల్ల మిరియాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఈ యాసిడ్‌లు, ఎంజైమ్స్ అధికంగా ఉత్ప‌త్తి అవుతాయి. దీంతో ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అయ్యి అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతుంది.

ఎలా వాడాలి..?

తెల్ల మిరియాల‌ను హెర్బ‌ల్ టీ, నీళ్లు, పాలు, క‌షాయాలలో వేసి మ‌రిగించుకొని తాగ‌వ‌చ్చు. తెల్ల మిరియాల పొడిని స‌లాడ్స్‌, మొల‌కెత్తిన విత్త‌నాల‌పై కూడా వేసుకొని తిన‌వ‌చ్చు. ఈ విధంగా తెల్ల మిరియాల‌ను వాడ‌డం వ‌ల్ల గ్యాస్ట్రిక్, అజీర్తి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ చిట్కా మీ ఏళ్లనాటి సమస్యను అయినా.. వేళ్లతో సహా తీసేస్తుంది..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.