వేసవిలో తరచూ ఫుడ్ పాయిజనింగ్ అవ్వ‌డానికి కార‌ణాలు

Summer food poisoning: సీజన్ ను బట్టి ఏదొక వ్యాదులు రావడం కామన్..అలాగే వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ తో ఇబ్బంది పడుతుంటారు..ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది.

వేసవిలో తరచూ ఫుడ్ పాయిజనింగ్ అవ్వ‌డానికి కార‌ణాలు
food poisoning in summer


సీజన్ ను బట్టి ఏదొక వ్యాదులు రావడం కామన్..అలాగే వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ తో ఇబ్బంది పడుతుంటారు..ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. ఎండాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ. అసలు వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది, ఎండాకాలంలో చాలా మందిని వేధించే ఫుడ్ పాయిజనింగ్ కు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...


బ్యాక్టీరియా వెచ్చని ఉష్ణోగ్రతల్లో వృద్ధి చెందుతుంది. వేసవి నెలల్లో ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలు ఎండలో లేదా వేడికి ఉంచితే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే వేసవిలో ఆహారం త్వరగా చెడిపోతుంది. ఇలాంటి చెడి పోయిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వేసవిలో అప్పుడే వండిన ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే ఫ్రీజ్ లో ఉంచిన వాటిని తినాలి.. ఇక బ్యాక్టీరియా ఆహారంపైకి వచ్చినప్పుడు అలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వేసవికాలంలో చాలా మంది టూర్లకు, సాయంత్రం వేళ స్ట్రీట్ ఫుడ్స్, బార్బెక్యూలు వంటి వాటిని తింటుంటారు. ఇలా బయట ఉండే బ్యాక్టీరియా ఆహార పదార్థాలపైకి చేరుతుంది.


అలాగే మాంసంలోని బ్యాక్టీరియా కూరగాయలకు, వాటిపై ఉండే క్రీములు మరోదానిపైకి చేరి ఆహారం కలుషితం అవుతుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం పెరుగుతుంది. ఇది వేసవిలో మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.. హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి, ఆహార విషాన్ని నివారించడానికి సరైన ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించాలి. లేకపోతే అందులోని బ్యాక్టీరియా సహా ఇతర హానికరమైన క్రీములు అలాగే ఉండిపోయి అవి కడుపులోకి వెళ్లినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తాయి..


ఇకపోతే కలుషిత నీరు తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు పెరుగుతాయి. వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు, క్యాంపింగ్ చేసినప్పుడు.. సరస్సులు, నదులు, బావులు, జలపాతాళ వద్ద నీటిని తాగడం వల్ల ఈకోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావొచ్చు.వేసవికాలంలో ఫుడ్ పాయిజనింగ్ తీవ్రమైన సమస్య. అయితే ఫుడ్ పాయిజనింగ్ ను నివారించవచ్చు కూడా. ఆహారం కలుషితం కాకుండా చూసుకోవడం, బయట ఆహారాన్ని తినకపోవడం, వంట వండేటప్పుడు సరిగ్గా ఉడికించడం, కలుషిత నీరు తాగకపోవడం వంటి సరైన చర్యల వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ కు గురికాకుండా ఉండొచ్చు.. ఈ విషయాలను తప్పక గుర్తుంచుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.