అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఉప్పు తినాలి? 

ఉప్పులేని ఆహారాన్ని అసలు తీసుకోలేము. ఆహారానికి రుచి  ఉప్పు. వంటల్లో ఏ పదార్థం వేసిన వేయకపోయినా ఉప్పు వేస్తే వచ్చే రుచే వేరుఅందించే ముఖ్యమైన పదార్థం. అయితే ఉప్పు పై ఎన్నో అపోహలు ఉన్నాయి. అసలు ఎంత పరిమాణంలో ఉప్పును తీసుకోవాలి. ఎలాంటి వారు తీసుకోవాలి.. అనే విషయం చాలా మందికి తెలియదు.

అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఉప్పు తినాలి? 


ఉప్పులేని ఆహారాన్ని అసలు తీసుకోలేము. ఆహారానికి రుచి  ఉప్పు. వంటల్లో ఏ పదార్థం వేసిన వేయకపోయినా ఉప్పు వేస్తే వచ్చే రుచే వేరుఅందించే ముఖ్యమైన పదార్థం. అయితే ఉప్పు పై ఎన్నో అపోహలు ఉన్నాయి. అసలు ఎంత పరిమాణంలో ఉప్పును తీసుకోవాలి. ఎలాంటి వారు తీసుకోవాలి.. అనే విషయం చాలా మందికి తెలియదు.
Signs You're Eating Too Much Salt – Cleveland Clinic
శరీరానికి ఎంత అవసరమైన సోడియం ఉప్పు కారణంగానే శరీరానికి అందుతుంది. శరీరంలో జరిగే ఎన్నో ప్రక్రియలకు కారణం సోడియం. ఈ మూలకం కారణంగానే శరీరంలోని కణాలు సరిగ్గా పనిచేస్తాయి. ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల మధ్య సమతుల్యం కుదురుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇన్ని పాత్రలు పోషిస్తుంది కాబట్టే సోడియం మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన సోడియంలో 90 శాతం ఉప్పు నుంచే లభిస్తుంది. ఉప్పు సాంకేతిక నామం సోడియం క్లోరైడ్.
సాధారణంగా ఆరోగ్యం వంతమైన వ్యక్తులు రోజుకే ఐదు గ్రాముల వరకు ఉప్పుని తీసుకోవచ్చు. అంటే దాదాపు ఒక టేబుల్ స్పూన్ కు సమానం. కానీ మన భారత దేశంలో మాత్రం సగటున 11 గ్రాముల వరకు ఉప్పుని తీసుకుంటున్నారని ఇది ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని చెబుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఏ ఉప్పు మంచిది.. అలాంటి ఉప్పును తీసుకోవాలి.. 

ఈ రోజుల్లో మార్కెట్లో చాలా రకాల ఉప్పులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో ఆహారంలో తీసుకోవడానికి మంచిది ఏదంటే తక్కువ పరిమాణంలో సోడియంని కలిగి ఉన్న ఉప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలుస్తోంది. అయితే ఉప్పును తయారు చేసే క్రమంలో వాడే పదార్థాలు రంగు రుచి ఆధారంగా ఉపయోగించాలి. సాధారణంగా రిఫైన్డ్ లేదా సాధారణ ఉప్పును అధికంగా ఉపయోగిస్తాం. ఇందులో 97-99శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఈ సాల్ట్ ను 'రిఫైన్డ్ సాల్ట్' అని ఎందుకు పిలుస్తున్నాం అంటే ఇందులో ఎలాంటి మలినాలు లేకుండా శుద్ధపరుస్తారు. కానీ పోషకాల పరంగా చూసుకుంటే ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదు.
సాధారణంగా సముద్రపు ఉప్పును తీసుకుంటే సముద్రంలో నీటిని ఆవిరి చేయడం ద్వారా ఈ ఉప్పునుసారంగా తయారు చేస్తారు. ఇది రిఫండ్ కాదు కాబట్టి ఇందులో ఖణిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు మన శరీరానికి ఎంతో మేలు చేసే అయొడిన్‌ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఉప్పు కన్నా సముద్రపు ఉప్పులో సోడియం 10 శాతం తక్కువగా ఉంటుంది.
సెల్టిక్ సాల్ట్ లేదా గ్రే సాల్ట్‌లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా సహజమైన ఉప్పు. ఇందులో ఇతర పదార్థాలను కలపరు. దీన్ని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే..

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు రావచ్చు. ఇదేకాకుండా ఉప్పును ఎక్కువగా తినడం వల్ల ఇతర ప్రమాదాలు కూడా కలుగుతాయి. గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు, మెదడుకు రక్త సరఫరాలో అవాంతరాలు అంటే మెదడులోని సిరలు తెగిపోవడం లేదా రక్తం గడ్డకట్టడం వంటివి ఏర్పడవచ్చు. ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు ఇతర వ్యాధుల ప్రమాదాలను తగ్గించవచ్చు. అందుకే ఎంతగా వీలైతే అంతగా ఉప్పును తగ్గించుకోవడం మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.