యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ఇలా వాడితే బరువు త్వరగా తగ్గొచ్చు

ఈ రోజుల్లో అధిక బరువుతో జనాలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. జిమ్‌లకు వెళ్లడం ఇష్ట లేకున్నా, టైమ్‌ లేకున్నా ఎలాగోలా వెళ్తున్నారు. బరువు పెరుగుతున్నప్పుడు ఎవరూ చెప్పరూ., తీరా బరువు పెరిగిపోయాక అరే వీడు ఈ మధ్య లావు

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ఇలా వాడితే బరువు త్వరగా తగ్గొచ్చు


ఈ రోజుల్లో అధిక బరువుతో జనాలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. జిమ్‌లకు వెళ్లడం ఇష్ట లేకున్నా, టైమ్‌ లేకున్నా ఎలాగోలా వెళ్తున్నారు. బరువు పెరుగుతున్నప్పుడు ఎవరూ చెప్పరూ., తీరా బరువు పెరిగిపోయాక అరే వీడు ఈ మధ్య లావు అయ్యాడ్రా, పొట్ట బాగా వచ్చింది అని అనడం స్టాట్‌ చేస్తారు. లావు అవుతున్నారంటే మీలో ఫస్ట్‌ కనిపించే ఛేంజ్‌ పొట్ట పెరగడమే. ఎప్పుడైతే మీరు పొట్టపెరిగినా పట్టించుకోలేదో అప్పుడే లైట్‌గా బుగ్గలు రావడం స్టాట్‌ అవుతాయి, గడ్డం కింద గడ్డం ఏర్పడుతుంది, చేతులు ఉబ్బుతాయి, ఛాతీ లూస్‌ అవుతుంది, ఇక పొట్ట గుట్టలా అవుతుంది. సీన్‌ కట్‌ చేస్తే షర్ట్ టైట్‌ అవుతుంది.! ఇంత పరిస్థితి రావొద్దంటే ముందు మీరు పొట్టను తగ్గించుకోవాలి. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వాడితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. మ‌రి బ‌రువును త‌గ్గించుకునేందుకు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా.!

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ 2 టీస్పూన్లు, దాల్చిన చెక్క పొడి 2 టీస్పూన్లు తీసుకుని బాగా క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లుపుకుని నిత్యం మూడు పూటలా తాగితే కొద్ది రోజుల్లోనే అధిక బ‌రువు తగ్గుతారని వైద్య నిపుణులు అంటున్నారు. 
నిత్యం ఉద‌యం, సాయంత్రం వేళల్లో ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టీస్పూన్ల తేనె, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను క‌లుపుకుని తాగితే అధిక బ‌రువు త్వ‌ర‌గా తగ్గుతుంది. 
మీకు ఇష్ట‌మైన ఏదైనా పండు ర‌సాన్ని తీసి అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తాగినా బ‌రువు త‌గ్గ‌వచ్చు. నిత్యం ఇలా రెండు సార్లు తాగాలి. కానీ అందులో చక్కెర కలపొద్దు.
గ్రీన్ టీలో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను క‌లుపుకుని తాగినా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. 
ఫ్రూట్ స‌లాడ్స్, వెల్లుల్లి ర‌సంతో కూడా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. 
యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను పైన చెప్పిన విధంగా తాగితే కేవ‌లం బ‌రువు త‌గ్గ‌డం మాత్ర‌మే కాదు, మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. చాలా మందికి యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వాడితే బరువు తగ్గొచ్చు అని తెలుసు, కానీ దాన్ని ఎలా ఎంత మోతాదులో వాడాలో పూర్తిగా తెలిసి ఉండదు. ఇప్పుడు చెప్పినట్లు ఒక నెల రోజుల పాటు ట్రై చేసి చూడండి. రిజల్ట్‌ రివీల్‌ అవుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.