ప్రేమ పెళ్లిళ్లు ఎందుకు విడాకులకు దారితీస్తాయి.? కారణాలు ఇవేనా..?

పెళ్లై పదేళ్లు దాటిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి.

ప్రేమ పెళ్లిళ్లు ఎందుకు విడాకులకు దారితీస్తాయి.? కారణాలు ఇవేనా..?
Divorce in love marriage


ఈ రోజుల్లో ఎలాంటి పెళ్లిళ్లు అయినా కలకలం నిలబడతాయి అన్న గ్యారెంటీ లేదు. పెళ్లై పదేళ్లు దాటిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది, మరి అప్పుడు నచ్చిన వ్యక్తి పెళ్లి తర్వాత ఎందుకు నచ్చడం లేదు. దీనికి కారణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటివల్ల కలిగే ప్రభావాలు మాత్రం పెద్దవే. ఇంతకీ ఆ కారణాలు ఏంటో చూద్దామా..

నిబద్ధత లోపించడం

ప్రేమలో ఉన్నప్పుడు ఏవైనా తప్పులు దొర్లితే, ఒక చిన్న సారీతో కూడా సర్ధుకుపోవచ్చు. కానీ పెళ్లయ్యాక ఆ నిబద్ధత లోపిస్తే సర్దుకుపోవడం ఉండదు, అంతా సర్దేయడమే ఉంటుంది. పెళ్లి తర్వాత అబ్బాయిలకు బాధ్యతలు పెరుగుతాయి. ఏదీ ముందులా ఉండదు.

అహంకారం

ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు, నేను స్వతంత్రంగా జీవించగలను అనే భావనలో మీలో ఉంటే, అలాంటి అహంకారం వర్కవుట్ కాదు. ఇద్దరు సంపాదించినా, ఒక్కరు సంపాదించినా ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది చాలా ముఖ్యం.

అనుమానం

ప్రేమలో ఉన్నప్పుడు భాగస్వామి ఏం చేస్తుంది, ఎవరితో ఉంది, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తే అది తనకు దక్కకుండా పోతారమో అనే భయంతో చేసినట్లు అవుతుంది. ఆ పొసెసివ్ నెస్ ప్రేమ అనిపించుకుంటుంది. కానీ పెళ్లి తర్వాత అలాగే చేస్తే దానిని అనుమానం అంటారు. అది అనర్థానికి దారితీస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా పొసెసివ్‌గా ఉంటే అది మొదటికే మోసం.

కుటుంబాన్ని లెక్కచేయకపోవడం

ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లయ్యాక కుటుంబం అంటే అత్తగారి ఇళ్లే. తల్లివైపు వారు పరాయి వ్యక్తులు అవుతారు. కాబట్టి స్త్రీలు మెట్టినింటి ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలి. ఆ కుటుంబాన్ని లెక్కచేయకపోతే, మీకు ఆ కుటుంబంలో స్థానం పోతుంది.

అభిప్రాయ భేదాలు

ప్రేమలో ఉన్నప్పుడు అభిప్రాయాలు వేరేగా ఉన్నా ఏం నష్టం ఉండదు. పెళ్లయ్యాక మాత్రం ఏకాభిప్రాయంతో ఉండాలి. అభిప్రాయ భేదాలు ఎక్కువ ఉన్నట్లయితే, భవిష్యత్తులో మీ సంబంధం ఎక్కువ కాలం ఉండబోదనే సంకేతం కూడా కావచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.