కండోమ్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాలి సుమా..

కండోమ్‌ సక్రమంగా వినియోగిస్తే..మహిళలు గర్భం దాల్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అవాంఛిత గర్భనివారణకైనా..జీవిత భాగస్వామితో కాకుండా ఇతర వ్యక్తులతో సెక్స్ చేసేటప్పుడు కండోమ్‌ను వాడటం చాలా అవసరం. అన్నింటికన్నా..

కండోమ్ వాడుతున్నారా? అయితే  ఈ జాగ్రత్తలు పాటించాలి సుమా..


సెక్స్ చేసేటప్పుడు సుఖ వ్యాధులు రాకుండా ఉండేందుకు చాలా మంది కండోమ్ వాడుతుంటారు. గర్భం దాల్చకుండా ఉండేందుకు కూడా కండోమ్‌ను వినియోగిస్తుంటారు.

కండోమ్‌ సక్రమంగా వినియోగిస్తే..మహిళలు గర్భం దాల్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అవాంఛిత గర్భనివారణకైనా..జీవిత భాగస్వామితో కాకుండా ఇతర వ్యక్తులతో సెక్స్ చేసేటప్పుడు కండోమ్‌ను వాడటం చాలా అవసరం. అన్నింటికన్నా ముఖ్యంగా సుఖ వ్యాధులను నివారించడానికి దీనిని మించిన సంజీవని ఇంకోటి లేదు. అయితే కండోమ్ ను ఇష్టారీతిన వాడితే అది అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

సరిగా వాడితే..... కండోమ్‌ చిరిగిపోకుండా, లీక్ కాకుండా ఉంటుంది. అందుకే కండోమ్‌ను తొడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్నాక ఎలా ఉందో చూసుకోవాలి. కండోమ్‌ను సంపూర్ణంగా తొడిగి, సక్రమంగా వాడితే 98 శాతం వరకు గర్భం రాకుండా నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే వినియోగంలో మాత్రం 85 శాతం వరకు మాత్రమే కండోమ్‌లు ప్రభావవంతంగా ఉంటాయని అంటున్నారు. గర్భ నిరోధానికి కండోమ్‌లను వాడినప్పుడు వాటిని సక్రమంగా వినియోగించడంలో తప్పులు దొర్లడమే ఇందుకు కారణం.

స్త్రీలు రుతుచక్రం సమయంలో సెక్స్ చేస్తే గర్భవతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ సమయంలో శృంగారానికి దూరంగా ఉంటే గర్భం రాకుండా చూసుకోవచ్చు.

ఇక, కొందరు గర్భం వచ్చే రోజుల్ని అంచనా వేసుకుని కలయికను వాయిదా వేస్తారు...... దీన్ని సేఫ్ సెక్స్ పీరియడ్ టెక్నిక్ అంటారు. దీన్ని ఆధారం చేసుకుని శృంగారంలో పాల్గొనడం ఏ మాత్రం సురక్షితమైనది కాదు.

సాధారణంగా నెలసరి వచ్చాక 12-15 రోజుల్లో అండం విడుదల అవుతుంది. అంటే అండం విడుదలయ్యేందుకు 5 రోజుల ముందు ఆ తర్వాత శృంగారానికి దూరంగా ఉండటం ద్వారా గర్భం రాకుండా చూసుకోవచ్చు. అయితే సెలసరి సక్రమంగా వస్తూ అండం కూడా అనుకున్న తేదీల్లో విడుదలైన వారికి మాత్రమే ఈ జాగ్రత్త వర్తిస్తుంది. కండోమ్‌తో పాటుగా ఇతర గర్భ నిరోధక మార్గాలను ఎంచుకోవడం. గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే శృంగారం చేసే సమయంలో కండోమ్ వాడటమే కాకుండా..ఇతర మార్గాలపై కూడా ఆధారపడటం చాలా మంచి ఆలోచన. అయితే ఇతర మార్గాలు కూడా ప్రభావవంతమైనవి అయి ఉండాలి. అందుకే కండోమ్‌తో పాటుగా..శృంగారం అనంతరం గర్బనిరోధక మాత్రలు వినియోగించడం ఉత్తమం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.